ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ
September 7, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య మేనల్లుడు సత్య,అన్నగారైన సోమేంద్రుడు ఇద్దరు ఈయనకు ఆటపాటల్లో జతగా వుండేవారు.ఇంటికి దర్జీ అంటే ( బట్టలు కుట్టే వాడు),రాగానే ముగ్గురు బయట సిద్దంగా వుండేవారు.నా చొక్కాకు జేబులు ఎక్కువ వుండాలని ఒకరు,నా చొక్కా కు అంతకన్నా ఎక్కువ వుండాలని ఇంకొకరు, దర్జీ నీ పురమాయించేవారు.జేబులెన్ని ఎక్కువగా వుంటే అన్ని ఆట వస్తువులు ఎక్కువగా దాచుకోవచ్చని వాళ్ళ అభిప్రాయం.ఈ అల్లరి పెద్దవాళ్ళ చెవిని పడితే వెంటనే వాళ్ళని గద్దించి లోపలికి తిరిమేవారు.లోపలికి వెళ్లి కాలి చెప్పులను పైకి ఎగురవేయడం, వాటిని ఈ మూల నుంచి ఆ మూలకు తన్నడం,ఒకరు అందుకోవడం, ఇంకొకరు అతని చేతులోనుంచి లాక్కోవడం,ఈ విధంగా ఆట కొనసాగేది.
   తాతయ్య తండ్రి మహర్షి దేవేంద్రనాద్ వీళ్ళను ఇంటి నుండి బయటకు వెళ్ళకుండా గట్టి ఏర్పాట్లు చేశారు.ఈ ముగ్గురు ఆడినా పాడినా అల్లరి చేసినా ఇంట్లోనే చేయాల్సిందే.తాతయ్య ఇల్లు మూడస్తుల పెద్ద బంగళా.ఆ బంగాళా లో ఎన్నో గదులు న్నాయి.తాతయ్య తండ్రి మహర్షి దేవేంద్రనాద్ తన కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకున్నారు.మహర్షి గారు ఎక్కువగా ఇంటి పట్టున వుండకపోవడం వల్ల ఆ గది ఎప్పుడూ మూసేసి వుండేది. మిగితాది రేపు.