ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ
September 22, 2020 • T. VEDANTA SURY • Serial

చదువు చూద్దామంటే చిలుక పలుకుల వలె అర్దం లేకుండా ఏవేవో కంఠత చేయించడం,గంటల తరబడి వల్లించడం, జరుగుతూ వుండేది.ఇల్లే బందీఖానా,అనుకుంటూ వుంటే, తాతయ్య కు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొయ్య బల్లల మీద కదలకుండా కూర్చుని వుండడం, కూడా ఇక్కో రకమైన బందీఖానా అయ్యింది.
                     ఆ రోజుల్లో ధనికులందరూ తమ పిల్లలకు ఇంగ్లీషు విద్యను నేర్పించేవారు.ఇంగ్లీషు విద్య నేర్చుకున్న వాళ్ళే,రాచ దర్బారులో గౌరవాన్ని పొందుతారని గట్టి నమ్మకం వుండేది.
కాబట్టి విద్యావంతులు తమ ఇళ్ళల్లో ఇంగ్లీష్ మాట్లాడటం,తమ బంధువులకు, స్నేహితులకు ఉత్తరాలు రాయవలసి వచ్చినప్పుడు, ఇంగ్లీష్ లోనే రాసేవారు.ఈ వ్యవహారం గమనిస్తే, మాతృభాషను మర్చిపోయారా అన్న అనుమానం కలుగుతుంది.
పాఠశాలలో పాఠాలన్నీ కూడా ఇంగ్లీష్ లోనే బోధిస్తంండేవారు.కానీ మన తాతయ్య అన్నగారికి ఈ పద్ధతి నచ్చలేదు.కాబట్టి ఆయన పాఠాలన్నీ మాతృభాష అయిన బెంగాలీ భాషలోనే బోదించాలనీ నిర్ణయించారు.ఈ నిర్ణయం రాను రాను తాతయ్య జీవితంలో, చాలా మేలు చేసిందని చెపుతుండేవాడు.పాఠం నేర్చుకోవడం అనేది, భోజనం చేయటం వంటిది.మొదటి ముద్ద రుచిగా వుంటే, భోజనం అంతా సంతోషంగా చేయొచ్చు.లేకపోతే తినలేం.ఆకలి కూడా చచ్చిపోతుంది.కాబట్టి మొదట, చదువు ఉత్సాహంగా వుండేటట్లు వుండాలి.అట్లా వుంటేనే, ముందు ముందు దానిలో బాగా అభిరుచి కలిగి, పిల్లలు  శ్రద్ధగా చదువుకుంటారు.కానీ మొదలే, నోరు తిరగని, కఠినమైన విదేశీ భాషలో చదువు మొదలుపెట్టి,విసిగిస్తే చదువులో వున్న ఆ కాస్త ఉత్సాహం కూడా చచ్చిపోతుంది.ఈ విషయం దేవేంద్రనాద్ కి బాగా తెలుసు.పిల్లల విద్యాస్థాయిని, ఉత్సాహాన్ని, పెంచాలంటే, మాతృభాష లోనే చదువు చెప్పించాలని,ఆయన వాదించేవారు.అదే విధంగా, తాతయ్య చదువు మాతృభాష అయిన బెంగాలీ భాషలోనే జరుగుతూ వుండేది.  మిగితాది రేపు......