ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ
October 11, 2020 • T. VEDANTA SURY • Serial


రవీంద్రుని ( తాతయ్య) పదునాలుగవ ఏటనే తల్లి మరణించింది.అప్పటి నుంచి తల్లి లేని లోటు కనపడకుండా ఆదరించి కాపాడిన మహా ఇల్లాలు కాదంబరీ దేవి.ఆమె ఇంటి కోడలిగా వచ్చినప్పటి నుంచి చిన్నవాడైన తాతయ్యపై ప్రేమ,ఆదరణ, చూపిస్తూ, ఆటపాటల్లో ఆయనను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తూ వుండేది.
   కాదంబరి దేవి తాతయ్యకి సంగీత, సాహిత్య,విద్యా విషయాలలో, ఎంతో సహాయపడుతూ,కన్న తల్లి లా పెంచిన మహాతల్లి.ఆమె చనిపోవడం వల్ల, తాతయ్యకు జతగా వున్న పెద్దన్న జ్యోతీంద్రుని జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన సంగీతం నాట్యం మొదలైన వినోదాలకు దూరమయ్యాడు.అయినప్పటికీ తాతయ్య తన దృడమైన మనోబలం తో కుటుంబంలో వచ్చిన ఈ విచారాలను లెక్క
 చేయలేదు.సాహిత్య సేవలోనూ ఎప్పుడూ అశ్రద్ధ వహించలేదు.సంగీత సాహిత్యాలలో సమానమైన కృషి సాగిస్తూ,దేశ సేవ వైపుకు కూడా తన దృష్టిని పోనిచ్చినాడు.ఈ మధ్య కాలంలో తాతయ్య రాసిన దానిలో అహల్య అనే పద్య కావ్యం చెప్పుకోతగింది.ఇందులో అహల్య శాపం,దాని విముక్తి మొదలైన కథను చక్కగా వివరించాడు.ఇంకొక పద్య కావ్యంలో నక్షత్రాలు, గ్రహాలకు  సంబంధించిన శాస్త్రీయ విషయాలు చక్కగా వర్ణించి చెప్పాడు.మిగితాది రేపు..