ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ
September 28, 2020 • T. VEDANTA SURY • Serial

స్కూల్ మానేసాకా తాతయ్యకు కొంత మనశ్శాంతి లభించింది.అప్పటికి ఆయన వయసు సుమారు పదమూడు సంవత్సరాలు వుండేది.కొంతవరకు ఆయనను పెద్ద పిల్లాడిగా 
గుర్తించేవారు.అప్పుడు తాతయ్యకు స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం వచ్చినా,బయటి ప్రపంచం తెలియదు.ఎవరితోనూ ఏ గ్రామానికి వెళ్ళలేదు.తన ఇంటి పరిసరాలు తప్ప, తాతయ్యకు విశాల ప్రపంచం, ప్రకృతి చూసే అవకాశం, అనుభవం లేకపోయింది.తన పన్నేండేళ్ళ జీవితానికి, ఒకవైపు ఇల్లు, మరొకవైపు స్కూల్ రెండూ బంధీఖానాలు అయ్యాయి.
  కవికి ప్రకృతితోను, ప్రపంచంతోను,ఎంత సాన్నిహిత్యం వుంటే, కవిత్వం అంత వన్నెకెక్కుతుంది.పెద్దవాళ్ళు తాతయ్య రాసే బాల్య గీతాలకు మాత్రమే ఆనందించేవారు.కానీ మునుముందు విశ్వకవి కానున్న తాతయ్యకు,విశాల ప్రకృతిలో, సాన్నిహిత్యం కురిపించాలి వారికేం తెలుసు? అయినా తాతయ్య  నాన్న గారు ఈ విషయాన్ని కొంత వరకు గ్రహించి, ఈయనకు తగిన వాతావరణం కల్పించాలని, అనుకున్నారు.రవీ నాతోపాటు 'బోలేపూర్' హిమాలయ ప్రాంతాలకు వస్తావా అని ఒకరోజు మహర్షి తాతయ్యను అడిగారు.ఆ మాట వినగానే తాతయ్య ఆనందానికి హద్దులు లేవు.అకస్మాత్తుగా సంతోషకరమైన వార్త విన్న, లేదా చెడు వార్త విన్న, వెంటనే నోటమారదని అంటారు.ఈ మాటలు తాతయ్య విషయం పట్ల నిజమైనాయి.ఎప్పుడూ ఇల్లు వదిలి బయటకు, పోవడం తెలియదు.మిగితాది రేపు.....