ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ
October 7, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య చిన్న తనం నుంచే, గీతాలు, రాయడం మొదలు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.క్రమబద్దమైన కవిత్వానికి, తాతయ్యకు మార్గం చూపించినవారు, జ్యోతిష ప్రకాశుడు.ఆయన మహర్షి మేన కోడలు కుమారుడు.జ్యోతిషప్రకాశుడు తాతయ్య కన్నా వయసులో పెద్దవాడు.ఆయన తాతయ్యను ఛద్దోబద్దమైన గీతాలు రాయమని బాల్యం నుంచి ప్రోత్సహించేవాడు.జ్యోతీషుడికి తాతయ్య గీతాలు బాగా రాస్తాడన్న నమ్మకం చాలా వుండేది.అప్పటికి తాతయ్య మాత్రా ఛందస్సులో అనేక గీతాలు రాస్తూ, ఇంట్లో అందరికీ వినిపిస్తూ,ఆనందింపజేస్తుండేవాడు.
                   కలకత్తాలోని సేయింట్ జేవియర్ స్కూల్ లో,చదువుకునేటప్పుడు మన బాల కవికి, సాహిత్య సేవ చేసే, కోరిక బాగా పెరిగింది.ఆ ఉత్సాహం చూసి, అక్కడి టీచర్లు కూడా తాతయ్యను ఇష్టం వున్న పుస్తకాలను,చదువుకోమని ప్రోత్సహించారు.అదే ఉత్సాహంతో, పుస్తకాలు చదవడమే కాకుండా,' పృథ్వీ రాజవీరాజయం' అనే నాటకాన్ని కూడా రాసారు. షేక్స్పియర్ రాసిన మేక్ బెత్ అనే నాటకాన్ని బెంగాలీ భాషలోకి అనువాదం చేసారు.
                   ఈ రెండు పుస్తకాలు మన బాల రచయిత మొదటి రచనలు.కానీ వాటికి సంబంధించిన రాత ప్రతులు ఇప్పటి వరకు లభించలేదు.ఆ తరువాత మొట్టమొదట అభిలాష అనే వైద్యానికి సంబంధించిన పుస్తకాన్ని రాసాడు.ఆ పుస్తకం తత్వ బోధిని అనే పత్రికలో వరుసగా ప్రచురించారు.మిగితాది రేపు.....