ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య--ప్రమోద్ ఆవంచ
October 31, 2020 • T. VEDANTA SURY • Serial
కొన్ని వారాల తరువాత తాతయ్య ఆరోగ్యం బాగుపడింది.యూరోప్ దేశ ప్రయాణానికి సిద్దమయ్యాడు.1912 సంవత్సరంలో తాతయ్య ఇంగ్లాండు వెళ్ళాడు.వెళుతూ తన గీతాలను ఇంగ్లీష్ లోనికి అనువాదం చేసాడు.
             ఇంగ్లాండ్ లో తాతయ్యకు ఒక మిత్రుడు వుండేవాడు.ఆయన పేరు విలియం రోధెన్ స్టెయిన్.ఈయన గొప్ప చిత్రకారుడు.విలియం ఇండియా పర్యటనలో జోరాసంకో భవనానికి వెళ్లి తాతయ్యతో మాట్లాడడం వల్ల ఇద్దరు మిత్రులు అయ్యారు.ఇప్పుడు తాతయ్య తన ఇంగ్లాండ్ టూర్ లో విలియం ను కలుసుకున్నప్పుడు ఇద్దరి ఆనందానికి అవధులు లేవు.
                         ఇద్దరు ఒకరినొకరు క్షేమ సమాచారాలు తెలుసుకొన్న తరువాత తాతయ్యను విలియం నీ గీతాలనేమైనా ఇంగ్లీష్ లోనికి అనువాదం చేసావా? అని అడిగాడు.అప్పుడు తాతయ్య తన గీతాల ఇంగ్లీష్ అనువాదాలను ఆయనకు చూపించాడు.విలియం ఆ గీతాలను చూసి చాలా సంతోషపడ్డారు.
                         తాతయ్య భారతీయ కవి మాత్రమే కాదు.ఆయన విశ్వ కవి అని ఆయన మనసులో అనుకున్నాడు.తానేదో గొప్ప నిధిని కనిపెట్టినట్లు, దానిని తన దేశ వాసులైన అనేక గొప్ప వారికి చూపించాలన్న కోరిక విలియం మనసులో కలిగింది.
మిగితాది రేపు...