ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
November 2, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య గీతాలలో సౌందర్యం, కవితా చమకృతి,భావ గాంభీర్యం, పాండిత్యం ఇంగ్లీష్ కవులను మంత్ర ముగ్ధులు చేసింది.వాళ్ళు ఆ గీతాలను వింటూ తన్మయులై, తమను తామే మరిచిపోయి కొయ్య బొమ్మల్లా,నోట మాట రాక,ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోయారు అంతే కానీ గీతాలు నచ్చక కాదు.
           ఆ సమయంలో తాతయ్య గీతాలు విన్న వారిలో చాలా మంది ఆయనకు స్నేహితులు అయ్యారు.ఇందులో ఒకరు ఎవ్రీ మ్యాన్స్ లైబ్రరీ ఎడిటర్ ఎర్నెస్ట్ వైస్, తాతయ్య రచనలను యూరోప్ లో ప్రచురించడానికి ఒప్పుకున్నారు.
             ఆ తరువాత తాతయ్యకు చాలా మందితో పరిచయం కలిగింది.అందులో చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్ ఒకరు.
ఈయన అంతకు ముందు డిల్లీ కళాశాలలో పనిచేసి అప్పుడే ఇంగ్లాండుకు తిరిగి వచ్చాడు.డిల్లీలో వుండగా తాతయ్య వ్యాసాలు, ఉపన్యాసాలు పత్రికల్లో చదివాడే కానీ గీతాలు చదవలేదు.ఆ రోజు నుంచి ఆండ్రూస్ తాతయ్యకు ప్రాణ స్నేహితుడు అయ్యారు.
మిగితాది రేపు....