ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 13, 2020 • T. VEDANTA SURY • Serial

సెలవు రోజు పనివాళ్ళు నా కొరకు భోజనాలు ముగించుకొని నిద్ర పోతారు.అప్పుడు నాకు బాగా తీరిక వుంటుంది.ఏకాంతంగా కూర్చుంటాను.నా మేనా పైకి కదలకుండా ఒకే చోట వున్నట్లు కనిపించినా,ఊహా ప్రపంచంలో యాత్ర చేస్తూనే వుంటుంది.నా మేన్ బోయీలు ఆకాశం నుంచి గాలిలో ఎగురుతూ వస్తారు.నా ఊహా నిర్మితమైన జీవాలు తింటారు కాబట్టి మేనా మోసుకొని నేనెక్కడికి తీసుకుపొమ్మని చెపితే అక్కడికి తీసుకెళ్ళుతారు.మేము చాలా దూర దేశాలకు , అద్భుతమైన ప్రదేశాలకు ప్రయాణం చేస్తాం.నేను తిరిగిన దేశాలకు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పేరు పెడుతాను.ఆ పేర్లను నేను చదివే పుస్తకాల్లో నుంచి తీసుకుంటాను.నా ఊహాయానం దట్టమైన అడవిలో నుంచి సాగిపోతుంది.అడవుల్లో పులులు, సింహాలు, గర్జిస్తూ, ఎదురుగా వస్తాయి.నాకు గుండె ఆగినంత పని అవుతుంది.నా వెంట విశ్వనాథ్ అనే వేటగాడు కూడా వుంటాడు.వెంటనే అతడు తన తుపాకీ గురి చూసి ఢాం ఢాం అని పేలుస్తాడు.అన్నీ చనిపోతాయి.మనసు నిమ్మళ మవుతుంది.
 ఒకోసారి నా మేనా హంస రూపమై నావగా మారుతుంది.సముద్రాలలో దూరం దూరం ప్రయాణం చేస్తుంది.ఉరుములు, మెరుపుల వర్షం ఆరంభం అవుతుంది.అలలు మా నావను పైకి లేపి కిందకు తీసుకొస్తూ,నావ వెంటే పయనిస్తుంటాయి.మిగితాది రేపు....