ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
October 12, 2020 • T. VEDANTA SURY • Serial

అప్పట్లో తాతయ్య అన్న జ్యోతీంద్రుడు ప్రారంభించిన భారతి పత్రికలో, తాతయ్య రాసిన, గీతాలు, వ్యాసాలు, కథలు,ప్రచురింపబడుతుండేవి.బాలక్ అనే పిల్లల పత్రిక పూర్తిగా తాతయ్య ఆధ్వర్యంలో నిర్వహించడుతూ వుండేది.
              బ్రహ్మ సమాజం, హిందూ సమాజాల మధ్య భేదాలు వచ్చినప్పుడు తాతయ్య నిజాయితినీ చూపించి సత్యాన్ని తెలుసుకోమ్మని బోధించాడు.పని లేకుండా సోమరిపోతుల్లా జీవితాలు గడుపుతూ, దేశాన్ని గురించి గొప్పగా మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించాడు.తాతయ్య దేశ ప్రేమ, గోల్డెన్ బెంగాల్ అనే గీతంలో చక్కగా కనబడుతుంది.అదే విధంగా, వైల్డ్ హోప్స్ అనే గీతంలో బ్రహ్మ సమాజం పేరుతో అశాంతిని లేపుతున్న అనేకులను విమర్శించాడు.
                      తాతయ్య సీల్డాలో వుంటున్నప్పుడు తన మేన కోడలు పేరట గ్లింప్సన్ ఆఫ్ బెంగాల్ అనే శీర్షికతో ఉత్తరాల ద్వారా అనేక విషయాలు రాసాడు.ఆ తరువాత ఆయన రాసిన ఎన్నో కథానికలు, ఇంగ్లీష్ భాషలోనికి అనువాదం చేయబడి పేరు గాంచాయి.
మిగితాది రేపు....