ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 10, 2020 • T. VEDANTA SURY • Serial

సాయంత్రం నౌకరు వచ్చి చదువుకునే గదిలో రెండు పెద్ద వత్తులు వేసి,ఆముదపు దీపాన్ని వెలిగించి పోతాడు.ఆ వెంటనే మాస్టారు సిద్దంగా వుంటారు.ఆ గుడ్డి వెలుతురు లోనే కూర్చోబెట్టి పెరీసర్కారు- మొదటి రీడర్ చదివిస్తుంటారు.కాని కూర్చున్న కొద్ది సేపటికే తాతయ్యకు తల బరువెక్కేది.ఆవలింతలు, కండ్లు నలపడం, కునికిపాట్లు పడడం,లాంటి అవలక్షణాలు ఎన్నో కలిగేవి.చదువు మీద కొంచెం కూడా మనసుండేది కాదు.చిలుకను పంజరంలో పెట్టి మాటలు నేర్పినట్లుగా వుండేది.
మాస్టారు బాగా చదువుకునే ఇతర పిల్లల గురించి చెపుతూ ఒక పిల్లాడు నిదుర రాకుండా కండ్లల్లో నశ్యం పెట్టుకునేవాడని పొగుడుతుండేవాడు.కానీ తాతయ్య కు ఇవేమీ పట్టేవి కాదు.నిద్రపోయే విషయంలో తాతయ్య పేరే మొదటగా చెప్పుకోవచ్చు.రాత్రి తొమ్మిది గంటలు అయ్యిందంటే కళ్ళు మూసుకుని నిద్రా దేవి ఒడిలోకి వెళ్ళిపోవల్సిందే, దానికి తిరుగులేదు.
ఆడుకోవడానికి తోడు మేనల్లుడు,తన అన్నయ్య వున్నప్పటికీ, తాతయ్యకు మొదటి నుంచి ఒంటరిగా వుండడమే అలవాటు అయ్యింది.ఇంట్లో ఏ మూలనో ఒంటరిగా కూర్చుని, చిత్ర విచిత్రాలైన ఊహలతో కాలం గడిపేవాడు.ఆ తత్వం ముందు ముందు శాంతి సాధనకు నిర్మాణాత్మకమైన ఆలోచనలకు సూచకం కావచ్చు, లేదా తన తండ్రి, ప్రభావం అయినా అయి వుండాలి.తాతయ్య చిన్న తనం నుంచే కుటుంబం లోని సందడిని,ఏ మాత్రం చెవిన పడనీయకుండా మనసును సుస్థిరంగా నిలిపి, ఏకాంతంగా ఎవరూ కనపడని చోట, కూర్చుని ప్రకృతి దృశ్యాలు,కల్పనా కథలు, చిత్ర విచిత్రమైన ఆలోచనలు చేసేవాడు.ఇవన్నీ చూస్తే తపోనిష్ట గల తన తండ్రి లక్షణాలు తాతయ్య లో సంపూర్ణంగా నిండి వున్నాయని చెప్పవచ్చు. తాతయ్య తన ఏకాంతంగా కాలం గడిపిన విధానం నా చిన్నతనపు రోజులు' అనే పుస్తకంలో చాలా చక్కగా రాసారు.--- మిగితాది రేపు.....