ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 14, 2020 • T. VEDANTA SURY • Serial

కలాసీలు మమ్మల్ని తుఫాను వస్తుంది, జాగ్రత్తగా వుండమని హెచ్చరిస్తారు.మా నావికుడు అబ్దుల్ ఒక పక్క నిలబడి వుంటాడు.మీసాలు తీసేసి, సన్నగా మొన తేలినట్లు గడ్డం, నల్లని శరీరం, కండరాలు తేలి బలంగా వుంటాడు.అబ్దుల్ అప్పుడప్పుడు మా పెద్దన్న  కోసం పద్మా తీరం నుంచి హిల్సా చేపలు, తాబేలు గుడ్లు,తెస్తుంటాడు.అబ్దుల్ తన సముద్ర ప్రయాణం పై నాకు కథ చెపుతాడు....అది చైత్ర మాసపు చివరి రోజు, అబ్దుల్ చేపలు పట్టడానికి నావలో వెళ్ళాడు.ఆ రోజు అనుకోకుండా పెద్ద తుఫాను వచ్చింది.ఆ పెద్ద తుఫాను లో తన నావ లోపలికి మునిగిపోతూ వుంది.అప్పుడు అబ్దుల్ నావకున్న తాడును తన పండ్లతో గట్టిగా పట్టుకొని నీళ్ళలోకి దూకాడు.ఈదుతూ, ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాడు.ఆ తరువాత తాడును పట్టుకొని నావను ఒడ్డుకు లాగుకున్నాడు.కానీ ఈ కథ చాలా చిన్నగా వుంది, కథలో అద్బుతాలు ఏమీ లేవు, చివరకు నావ కూడా మునిగిపోలేదు, అంతా సవ్యంగానే జరిగింది,
 ఇదేం కథ? వెంటనే,ఆ తరువాత ఏం జరిగింది? అని నేను అడిగాను,సరే అంటూ అబ్దుల్ కథ మళ్ళీ ఆరంభిస్తాడు.ఆ తరువాత చాలా అద్బుత విషయాలు జరిగాయి. మిగితాది రేపు...