ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 15, 2020 • T. VEDANTA SURY • Serial

ఒక పెద్ద చిరుత పులి వచ్చింది.తుఫాను వచ్చినప్పుడు ఆ చిరుతపులి చెట్టు మీదికి ఎక్కి కూర్చొని వుంటే,ఆ చెట్టు కూలి 
చిరుత పద్మానదిలో పడిపోయింది.చిరుతపులి వరదలో కొట్టుకుంటూ వచ్చి,నేనున్నా గట్టుకే చేరింది.చాలా దూరం నీళ్ళల్లో ఈది రావడం వల్ల చిరుత కు బాగా ఆకలి వేసినట్లుంది
నన్ను చూడగానే దాని నోట్లో నీళ్ళు ఊరడం మొదలైంది.నాలుక బయటకు చాపి కోరలు తెరుచుకొని గుర్రుమంటూ,నా వైపుకు బయలుదేరింది.నాలుక చివరి నుంచి నీళ్లు బొట్లు, బొట్లుగా కారుతున్నాయి.చిరుత నన్ను తిందామనుకుంది, కానీ నేను భయపడుతానా, అది నా లాంటి వాళ్ళను వంద మందిని చూసి వుంటుంది కానీ, అబ్దుల్ ని చూసి వుండదు.నేను వెంటనే నా దగ్గర ఉన్న తాడును, చేతిలోకి తీసుకుని, దాని చివర ఉచ్చు వేసి,రా! చిరుత పులి బావా రా! అంటూ పెద్ద కేక వేసాను.వెంటనే చిరుత ఒక్క అడుగు లో నా ముందుకు దూకి, రెండు కాళ్ళు లేపి,నా గొంతు పెట్టుకోవాలని చూసింది.కాని వెంటనే,దాని మెడలో ఉచ్చు వేసి,బిగించాను.అది విదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, ఉచ్చు ఇంకా బిగుసుకుపోసాగింది.చివరకు కళ్ళు మూసుకుని పోయి,నాలుక బయటకు వచ్చింది. అబ్దుల్ చెపుతుంటే నాలో ఉత్సాహం పెరిగిపోతూ వుంది.చివరకు పులి చనిపోయిందా అబ్దుల్ అని రెట్టింపు స్వరంతో అడిగాను.చచ్చిపోవడమా? అదెక్కడ చస్తుంది! అప్పటికే పద్మా నదిలో నీటి పోటు ఎక్కువ అయ్యింది.నేను బహద్దూర్ గంజ్ కి వెళ్ళవలసి వుండి సిద్దమయ్యాను.చిరుతను నావకు కట్టి,నలబై మైళ్ళు ప్రయాణం చేసాను.అబ్బ! దాని కేకలు, బొబ్బలు,ఇంతింత కాదు,అది అరుస్తుంటే తెడ్డుతో,అదిలిస్తూ,తీసుకెళ్ళాను. పది, పదిహేను గంటల ప్రయాణం, గంటన్నర లో తీసుకువెళ్ళింది.బాబూ!ఆ తర్వాత ఏమయిందని అడుగుకు, దానికి సమాధానం దొరకడం కష్టం.మిగితాది రేపు....