ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
October 2, 2020 • T. VEDANTA SURY • Serial

డల్హౌసీ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, తాతయ్య జీవన విధానమే మారిపోయింది.కళాకారుల సహవాసం,స్వతంత్ర జీవనం, గ్రంధాలు చదవడం, విజ్ఞానాన్ని సంపాదించడం,అంతే కానీ గతంలో లాగా ఎలాంటి నిర్బంధాలు లేవు.తాతయ్య వివిధ విషయాలు చదివి తరుచుగా గీతాలు రాస్తుండేవాడు.తాను రాసిన ప్రతి గీతాన్ని, ఇంట్లో అందరికీ చదివి వినించేవాడు.అందరూ చాలా సంతోషించేవారు.తాతయ్యకు ఈత అంటే చాలా ఇష్టం.గంగానదిలో తాతయ్య వీలు దొరికినప్పుడల్లా ఈదుతుండేవాడు.చిన్నతనంలో తన ఇంటి ఆవరణలో ఉన్న చిన్న సరస్సులో ఈత నేర్చుకున్నాడు.ఇప్పుడు ఆయన గొప్ప ఈతగాడు.
                     తాతయ్య అయిదవ అన్న జ్యోతింద్రనాద్ నాటకాలు వేస్తుండేవాడు.ఆయన తన స్నేహితులతో,తమ ఇంట్లోనే స్టేజీ ఏర్పాటు చేసుకొని, తరుచుగా నాటకాలు ఆడుతుండేవాడు.కాని అందులో పిల్లలు పాల్గొనేందుకు అవకాశం వుండేది కాదు.చివరికి పిల్లలు చూడడానికి కూడా అనుమతి వుండేది కాదు.చాలా రాత్రి వరకు మెల్కోవడం వలన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని, తాతయ్యను చూడనిచ్చేవారు కాదు.తాతయ్య తన పదహారవ ఏట,జ్యోతీంద్రుడు ఏర్పాటు చేసిన నాటకంలో ప్రప్రధమంగా, పాల్గొన్నాడు.ఆ డ్రామాలో తాతయ్య అనుభవం పొందిన, నటుడిగా, అందరి మన్ననలు పొందాడు.అప్పటి నుంచి,జ్యోతీంద్రుడు, తాతయ్యను,తమ జట్టులో కలుపుకుని,నాటకరచన, నటనలో ప్రోత్సహించేవాడు.
విద్యావంతులైన బెంగాలీ కుటుంబాల వారు తమ కాలంలో వెలువడిన బెంగాలీ సాహిత్యాన్ని, చాలా ఉత్సాహంగా చదువుతుండేవారు.ఆ రోజుల్లో బంకించంద్ర ఛటర్జీ గొప్ప నవలా రచయితగా,పేరు పొందారు.బెంగాలి దర్శిని అనే పత్రికలో ఆయన రచనలు ఎక్కువగా ప్రచురిస్తుండేవారు.తాతయ్య అందరి కన్నా ముందే ఆ సంచికను చదివి, ఇంట్లో అందరికీ వినిపిస్తుండేవాడు.మిగితాది రేపు.....