ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 29, 2020 • T. VEDANTA SURY • Serial

వాకిలి దాటనీయని తండ్రి నేడు తనను హిమాలయ ప్రాంతాలకు విహారానికి రమ్మంటున్నాడంటే, ఆశ్చర్యం-ఒకవైపు చిన్నతనం నుంచి,గడపదాటే అవకాశం లేక బంధించబడిన చిలుక లా వున్న తాతయ్యకు,విశాల ప్రకృతి లో,విహరించే అవకాశం దొరికినందుకు సంతోషం వేరొక వైపు,ఏక కాలంలో ఆయనను ఆవరించి,తన తండ్రి ఆడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేక పోయాడు.అయినా మహర్షి కి తాతయ్య సమాధానం ఇవ్వకుండానే, అతని కళ్ళలో సంతోష పూర్వక సమ్మతి తెలిసిపోయింది.కొద్ది రోజుల్లోనే ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి.రైల్వే స్టేషన్ కు బయలు దేరారు.
                తాతయ్య రైలును చూడడం ఇదే మొదటిసారి.తాతయ్య,ఆయన నాన్న గారు,బోలాపూర్ గ్రామానికి చేరుకున్నారు.ఆ గ్రామానికి రెండు మైళ్ళ దూరంలో ఒక ఆశ్రమం వుంది.దానిపేరే శాంతి నికేతన్.ఆఆశ్రమాన్ని మహర్షి గారు ఏర్పాటు చేసుకున్నారు.అప్పటికి తాతయ్య చాలా చిన్న వాడు.ఆ రోజుల్లో మహర్షి గారు,బోలపూర్ సమీపంలో కొంత భూమిని తీసుకుని, అక్కడొక ఇల్లు కట్టించినారు.మహర్షి తన తీరిక సమయాల్లో, విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేస్తూ ప్రశాంతంగా కాలం గడుపుతుండేవారు.అందుకేదానికి శాంతి నికేతనం అని పేరు పెట్టారు.మిగితాది రేపు....