ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
November 12, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య విశ్వభారతి స్థాపించినప్పటి నుంచి 1936 సంవత్సరం వరకు సుమారు 16 సంవత్సరాలు, విరామం లేకుండా ప్రపంచం అంతా తిరిగి విశ్వభారతి కోసం డబ్బులు సేకరించాడు.ఒక్క 1931లో తప్ప మిగితా కాలమంతా ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగి విశ్వశాంతి,విశ్వప్రేమ,విశ్వ మానవ సోదర భావాన్ని పెంపొందించడానికి విశ్వభారతిని అన్ని విధాలా పోషించవలసిన అవసరం వుందని, ప్రచారం చేసాడు.
                       విశ్వభారతి నుంచి విద్యార్థుల బృందాలను వెంటపెట్టుకొని 70 ఏళ్ల వయసులో కూడా తాతయ్య అనేక దేశాలు తిరిగి శాంతి ప్రచారం చేస్తూ విశ్వ భారతి కోసం విరాళాలు సేకరించాడు.ముక్తసరిగా తాతయ్య యాత్రలు గురించి చెప్పవలసి వేస్తే 1920ల పశ్చిమ భారత దేశంలో 14నెలలు పర్యటించాడు.1920-21లో అమెరికా వెళ్ళాడు.1922 లో దక్షిణ భారతం, శ్రీలంక పర్యటించాడు.1923లో కారియావాడ్,సింద్, అస్సాం రాష్ట్రాలలో పర్యటించాడు.మిగితాది రేపు....