ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
October 27, 2020 • T. VEDANTA SURY • Serial

ఆశ్రమంలో పిల్లలు తమ లీడర్ ను వాళ్ళే ఎన్నుకొని,ఆ లీడర్ సూచనల ప్రకారం తమ పనులు తామే చేసుకునేవారు.ఈ పద్దతి స్వయం పరిపాలనా వ్యవస్థ కు పునాది వేసింది.సూచనలను పాటించని విద్యార్థులకు అర్థమయ్యేలా శిక్షణ ఇవ్వాలా,లేక ఏవిధమైన శిక్ష వేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు.
                   శాంతి నికేతన్ లో పిల్లలు ఉదయం, సాయంత్రం తప్పని సరిగా ప్రార్థనలు చేయవలసి వుండేది.తాతయ్య రాసిన ప్రార్థన గీతాలనే పిల్లలు సర్వ వాద్య తాళాలతో శ్రావ్యంగా పాడటం నేర్పించినాడు.సూర్యోదయానికి ముందే ఒక గ్రూపు పిల్లలు ఆశ్రమం అంతా తిరిగి ప్రార్థనా గీతాలు పాడుతూ విద్యార్థులను నిద్ర లేపే వారు.ఆ గీతాలు ప్రకృతి లేదా దేవుడికి సంబంధించినవై వుండేవి.తాతయ్య ఏ కాలానికి అనుగుణంగా అప్పటి పరిస్థితులను బట్టి తగిన గీతాలు రాస్తూ పిల్లలకు నేర్పేవాడు.తాతయ్య పిల్లలను ఉదయం, సాయంత్రంఒక పావు గంట మౌనంగా కూర్చోవడం అలవాటు చేసాడు.ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలు చేయమని కానీ,ఆ సమయంలో ఏం ఆలోచనలు వచ్చాయే అడిగేవాడు కాదు.మిగితాది రేపు....