ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
October 1, 2020 • T. VEDANTA SURY • Serial

మహర్షి గారు, డల్హౌసీ లో ఉన్నప్పుడు తాతయ్యకు అనేక విషయాలు బోధిస్తుండేవాడు.ఇంగ్లీషు, సంస్కృతం, వ్యాకరణం, జ్యోతిష్యం,మొదలైన శాస్త్ర విజ్ఞానం,లోకానుభవాలు, అనేకం తాతయ్య తన తండ్రి గారి నుండి నేర్చుకున్నారు.అక్కడ వున్నప్పుడు తాతయ్యకు అనేక కావ్యాలు చదివే అవకాశం దక్కింది.మహాకవి కాళిదాసు రచించిన మేఘ సందేశం కూడా చదివారు.ఆ కావ్యంలోని మాధుర్యం, అలంకారాలు,కథ అన్నీ తాతయ్యను, ఎంతో ముగ్ధుణ్ణి చేసాయి.అందుకే కాళిదాసు రాసిన కావ్యాలను, తాతయ్య తన జీవితంలో అనేక సార్లు చదివి ఆనందించాడు.తాతయ్యకు డల్హౌసీ లో వున్నంతకాలం ఏ విధమైన నిర్బంధం లేకుండా, జీవితానికి ఉపయోగపడే విద్య నేర్చుకున్నాడు.సాయంత్రం ప్రార్థన అయిపోయాకా, ఇద్దరూ విశాలాకాశం కింద కూర్చుని, వున్నప్పుడు తాతయ్య , నక్షత్రాలు, గ్రహాలు, ఖగోళశాస్త్రం గురించిన వివిధ ప్రశ్నలు వేస్తుండేవాడు.వాటన్నింటికి మహర్షి, విపులంగా సమాధానాలు ఇచ్చేవారు.ఈ విజ్ఞానం దినదినం అభివృద్ధి చెంది, తాతయ్య తన చివరి రోజుల్లో, జ్యోతిష్య శాస్త్రం మీద ఒక గ్రంధాన్ని కూడా రాసారు.ఆ పుస్తకం శాస్త్రీయ దృష్టితో, సాధారణ భాషలో, రాసారు.
మొత్తం మీద డల్హౌసీ లో వున్న ఆ నాలుగు నెలలు, తాతయ్యకు జీవన వికాసం కలిగిందనీ, చెప్పవచ్చు.ఈ వికాసమే ఆయనకు ముందు జీవితంలో, కవి, పండితుడు, చిత్రకారుడు, శాస్త్రజ్ఞుడు, కావడానికి పునాదులు వేసింది.--మిగితాది రేపు......