ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 4, 2020 • T. VEDANTA SURY • Serial

మహర్షి దేవేంద్రనాద్ టాగూర్, శారదాదేవి ల 14వ సంతానం గా మన తాతయ్య జన్మించారు.తాతయ్య పెద్దన్న గొప్ప కవి, పండితుడు.రెండవ అన్న సత్యేంద్రనాద్ దేశంలోని మొట్టమొదటి సివీలియన్ గా పేరు పొందారు.ఈయన మంచి కవి.ఈయన రాసిన పుస్తకాలలో నా బాల్య కథ,బాంబామిప్రభాస్,బుద్ద చరిత్ర చాలా ప్రాచుర్యం పొందాయి.మేఘధూత అనే పుస్తకానికి పద్యానువాదం కూడా చేసారు.దేశభక్తి కి సంబంధించిన అనేక గీతాలు రాసి ప్రజలలో దేశభక్తి ని నింపారు.ఈయన భార్య జ్ఞానదానందిని దేవి.అప్పట్లో సమాజానికి సంబంధించిన కళలలోనూ, సాంప్రదాయాలలోనూ ఆమెకు ఆమే సాటి.బెంగాల్ లో వస్త్రాలను ధరించే సరికొత్త విధానాన్ని ఆమె ప్రవేశ పెట్టి మహిళలందరికి ఆదర్శమైంది. జ్ఞానదానందినిదేవి సాహిత్యం లో కూడా దిట్ట.తన కుటుంబం లోని పిల్లలకు సాహిత్యంపై ఆసక్తి కలిపించేందుకు ఆమె బాలక అనే పేరుతో ఒక పత్రిక నడుపుతుండేది.
                  తాతయ్య మూడవ అన్నయ్య జ్యోతిరీంద్రనాద్.ఈయన మంచి నాట్య కారుడు.సంగీతం కూడా బాగా తెలుసు.మంచి రచయిత, మరియు చక్కని అనువాదకుడు.టాగూర్ వంశంలో సంగీతం అభివృద్ధి చెందడానికి ఈయనే కారణం.ఈయన భార్య కాదంబరీ దేవి.ఆమెకు కూడా సంగీతం నేర్పించాడు సంస్కృత గ్రంథాలు,ఫ్రెంచి కథలు ఎన్నో అనువాదం చేసారు.ఈయన రాసిన పుస్తకాలలో అశ్రుమతి , మరియు సరోజిని లు పేరు పొందాయి.ఈయన తన చివరి రోజుల్లో రాంచి అనే ప్రదేశంలో వుండి సాహిత్య సాధనలో గడిపారు.
                 మిగితాది రేపు...