ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 19, 2020 • T. VEDANTA SURY • Serial

కిటికీ దగ్గర నిల్చొని దగ్గరలో ఉన్న చెరువు,దానిలో తిరుగుతూ ఆడుకుంటూ వుండే బాతులు, పక్షులు, తామర పూలు, మొదలైన ప్రకృతి దృశ్యాలను చూస్తూ కాలం గడిపేవాడు.చెరువులో స్నానం చేయడానికి, అనేక మంది వస్తుండేవారు.వాళ్ళు స్నానాలు చేసే పద్దతి, బట్టలు ఉతుక్కోవడం, ఈదడం లాంటి అనేక చిత్రాలను చూస్తూ,ఆనందిస్తుండేవాడు.
               ఇల్లు దాటి, బయటకు వెళ్ళే అవకాశం లేదు కదా! అందుచేత తాతయ్య కు బయటి ప్రపంచం లో ఏం జరుగుతుందో తెలియదు.అందువల్లనే అలాంటి దృశ్యాలు కంట పడినప్పుడు, ఆయనకు ఆశ్చర్యం, ఉత్సాహం,కలుగుతూ వుండేది.
               సీతాఫలపు గింజ నాటితే మొలకెత్తి,చెట్టవుతుందనీ ఎవరో చెప్పారట.అందుకోసం తాతయ్య ఒక సీతాఫలపు గింజను సంపాదించి,ఒక డబ్బాలో నాటి, ప్రతి రోజూ నీళ్ళు పోస్తుండేవాడట.కాని ఆ డబ్బా నిండిపోగానే, తీసుకొని పోయి బయట పారబోస్తారు.అలాగే జరిగింది.గింజ మొలకెత్తకుండానే
ఆ డబ్బా ను ఖాళీ చేసారు.
                ఇంకొకసారి మాస్టారు గారు, ఆకాశంలో ఏమీ లేదని,ఆ నల్లగా కనిపించేది మబ్బు మాత్రమేననీ, ఎన్ని నిచ్చెనలు వేసుకొని, పైకి ఎక్కినా, ఆకాశం తలకు తగలదనీ చెప్పినప్పుడు, తాతయ్య కి ఎంతో ఆశ్చర్యం కలిగిందట.పైన కప్పు వలె కనిపిస్తుంటే,ఎన్ని నిచ్చెనలు వేసుకుని, ఎక్కినా, తలకు తాకదని అంటాడేమిటా! అని ఆయనకు అనుమానం.ఇంకా ఎన్ని నిచ్చెనలు వేసుకుని ఎక్కినా ఆకాశం అందదా?అని ప్రశ్నించేవాడట.ఎన్ని నిచ్చెనలు వేసుకున్నా లాభం లేదని, మాస్టారు గారు, కచ్చితంగా,చెప్పేసారనీ తాతయ్య చెపుతుండేవాడు.--- మిగతా రేపు