ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
November 3, 2020 • T. VEDANTA SURY • Serial

ఆండ్రూస్ కొన్ని రోజుల తరువాత అంటే 1914 వ సంవత్సరంలో ఇండియాకు వచ్చారు.ఇక్కడ ఆయన ఢిల్లీ వదిలి తాతయ్య ఆశ్రమంలోనే వున్నారు.శాంతి నికేతన్ ఆశ్రమానికి ఆయన విశేషంగా సేవ చేసారు.
                      రవీంద్రుని గీతాల ఇంగ్లీష్ అనువాదాలు గీతాంజలి అనే పుస్తకం రూపంలో ప్రచురింపబడి యూరోప్ దేశంలో ఆయనకు గొప్ప పేరు, ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి.యూరోప్ దేశస్తులు తాతయ్యను దేవుడు పంపిన దూతగా భావించారు.
                      తాతయ్య 1912-1913 లో అమెరికా దేశానికి   వెళ్ళారు.చికాగోలోను, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోను,భారతీయ ప్రాచీన సంస్కృతి, జాతి వివక్షత మొదలైన విషయాలపై ప్రసంగించి, అక్కడి శ్రోతలను ఆశ్చర్యపరిచారు.
                         1913 లో తాతయ్య అమెరికా నుంచి ఇంగ్లాండ్ కు తిరిగి వచ్చి,అదే సంవత్సరం, నవంబర్ లో ఇండియాకు తిరిగి వచ్చాడు.తాను ఇంటికి చేరుకున్న వెంటనే తన గీతాంజలి పుస్తకానికి నోబుల్ అవార్డు ప్రకటించబడింది.అప్పటి వరకు ఈ అవార్డు యూరోప్ దేశస్తులకు తప్ప,ఇతర దేశస్తులకు ఎవరికీ ఇవ్వలేదు.అలాంటిది,ఈ అవార్డు తాతయ్యకు రావడం వల్ల మన దేశానికి గొప్ప కీర్తి లభించింది.--మిగితాది రేపు.....