ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
November 8, 2020 • T. VEDANTA SURY • Serial

1919 సంవత్సరం ప్రారంభంలో దేశ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది.మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లీష్ వాళ్ళకు సహాయ పడి మన దేశం నలుమూలలా కరువు వ్యాపించింది.నిరుద్యోగం, ఆకలి,ఎక్కువై ధరలు పెరిగిపోయి, ప్రజలు నానా బాధలు పడ్డారు.
                   మహాత్మా గాంధీ శాసన ధిక్కారణోద్యమం( Repressine Regislation), జరుపుతున్న రోజులు.దేశమంతటా గొప్ప గొప్ప సమావేశాలు జరుపుతూ, ఉద్యమాన్ని బలపరుస్తున్నారు.1919, ఎప్రిల్ 13వ తేదీన జరిగిన జలియన్ వాలా బాగ్ సంఘటన తరువాత తాతయ్య మనసుకు చాలా విచారం కలిగింది.ఆ బాధలో కలకత్తా వెళ్లి రాజకీయ నాయకులను,సమావేశ పరిచి,ప్రజా ఉద్యమాన్ని లేవదీయాలని ప్రయత్నించాడు.
                      బహిరంగ సభను ఏర్పాటు చేయమనీ దానికి తాను అధ్యక్షత వహిస్తాననీ,అనేక విధాలుగా చెప్పినప్పటికీ, రాజకీయ నాయకులు పెడచెవిన పెట్టారు.అప్పుడు తాతయ్య తానే అసమ్మతి తెలియజేయాలనీ అనుకొని,1919,మే 30 వ తేదీన, వైస్రాయ్ పేరిట తనకు ఇచ్చిన సర్ బిరుదును విసర్జిస్తున్నాననీ, ఒకవైపు తన దేశ ప్రజలపై అన్యాయంగా హింసాకాండ జరుపుతుంటే, సర్ బిరుదును వుంచుకొని గౌరవింపబడటం నాకు సిగ్గు చేటుగా వుందని లేఖ రాశాడు.--మిగితాది రేపు....