ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 23, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య కు ఇప్పుడు తొమ్మిది,లేక పది సంవత్సరాల వయస్సు వుంటుంది.తాతయ్య నాన్న గారు సాధారణంగా ఇంటి దగ్గర వుండరు.దేశయాటన చేస్తూ వుండేవారు.దేవేంద్రుడు తాతయ్య కు మూడవ అన్న.ఆయనే ఇప్పుడు పిల్లల చదువుల సంగతి చూసుకుంటున్నారు.ఆదివారం తప్ప మిగతా రోజుల్లో స్కూలు నుంచి వచ్చాక, చదవడం,రాయడం, చాలా బాగా వుంటుంది.శీతా కాలంలోనూ,వేసవి కాలంలోనూ, ఉదయం, సాయంత్రాలు ఇంట్లో కూడా పాఠాలు జరుగుతుండేవి.తాతయ్య సూర్యోదయం కంటే ముందే లేచి ఇంటి ఆవరణలో ఒక మూల వున్న వ్యాయామశాలకు వెళ్ళేవాడు.అక్కడ కుస్తీలు పట్టడం అభ్యాసం చేసేవాడు.పాఠం అయిపోయిన తరువాత లోపలికి వచ్చి ఏడు గంటలకు వేరే మాస్టారు గారు వచ్చే లోగా సిద్ధంగా వుండేవాడు.మన తాతయ్య తో పాటు సోమేంద్రుడు,సత్య, ఇద్దరూ,ఇంకొక అక్క గారు కూడా కలిసి,చదువుకునే వారు.
ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు, వీరు బెంగాలీ సాహిత్యం, గణితం,శరీర శాస్త్రం, ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకునేవారు. సామాన్య శాస్త్రం బోధించేందుకు ప్రత్యేకంగా ఒక టీచర్ వుండేవారు.తాతయ్యకు సామాన్య శాస్త్రం అంటే చాలా ఇష్టం.ఆ టీచర్ సాధారణ వస్తువులతోనే, అనేక ప్రయోగాలు చేసి, చూపించి చాలా చక్కగా బోధించేవారు.ఏ రోజైనా ఆ టీచర్ రాకుంటే, తాతయ్య చాలా బాధ పడేవాడు. మిగితాది రేపు....