ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 12, 2020 • T. VEDANTA SURY • Serial

నేను మేనా లోపల ఏకాంతంగా వున్నా వెలపలి నుంచి వచ్చే కేకలు, నౌకర్లు పనులల్లో వుండి చేసే చప్పుళ్ళు అన్నీ వినబతూనే వుంటాయి.ప్యారీ బజారు నుంచి కూరగాయల బుట్ట చంకన పెట్టుకొని తీసుకువస్తుంది.దుక్కన్ భుజాన కావడి వేసుకొని గంగానది నుంచి మంచినీళ్లు తెస్తున్నాడు.బట్టలు వేసుకొని తెచ్చిన ఒకామె లోపలికి వెళ్ళి కొత్త నమూనా చీరల బేరం సాగిస్తుంది.దీను కంసాలి మా ఇంట్లో జీతం.లోపలికి వెళ్ళే సందు పక్కన వున్న గదిలో గొట్టం ఊదుతూ కూర్చుంటాడు.ఇప్పుడాయన చెవిలో పెన్సిల్ పెట్టుకొని లెక్కలు చూస్తున్న కైలాస్ బాబు వెళుతున్నాడు.దూదిఏకే మనిషి వసారాలో కూర్చొని తన పని తాను చేసుకుంటున్నాడు.వాకిట్లో భిక్ష గాళ్ళ గుంపు మామూలుగా దొరికే బిక్షానికై ఎదురు చూస్తున్నారు.పొద్దు గడిచిపోతూనే వుంది.ఎండ వేడి ఎక్కువ అవుతుంది.గేటు దగ్గర గంట మోగింది.కానీ మేనాలో కూర్చున్న నాకేమి తెలియడం లేదు.మేనా లోపల గడియారం అధికారమేమి చెల్లదు.మాకు రాజు గారి సింహం ద్వారం వద్ద నగారా మోగినపుడు మధ్యాహ్నం అవుతుంది.అప్పుడు మా దర్బార్ ముగుస్తుంది.రాజుగారు లేచి పన్నీటి తో స్నానం చేయడానికి మహల్లోకి వెళతారు. మిగితాది రేపు...,.