ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 21, 2020 • T. VEDANTA SURY • Serial

ఏదో విధంగా నది, నదిలో నావలు,పైన ఆకాశంలో నల్లని మబ్బులు, వర్షం అన్నింటినీ వివరంగా చూడగలిగేవాడు.ఈ దృశ్యాలు అన్నీ సామాన్యమైనవే.అయినా పంజరంలో బంధించిన చిలుక వలె ఉండడం చేత, ఇటువంటి ఆనందాలను ఆస్వాదించే అవకాశం కోల్పోయాడు.ఇప్పుడు పంజరంలో నుంచి విడిపోయిన పక్షి వలె, విశాలమైన సుందర ప్రకృతిలో, చిత్ర విచిత్రమైన దృశ్యాలను చూస్తూ వుంటే తాతయ్య ఆనందానికి అంతే వుండేది కాదు.
తాతయ్యను మొట్టమొదట ఓరియంటల్ సెమినరీ స్కూల్ లో చేర్పించారు.అక్కడ తాను నేర్చుకున్నది ఏమీ లేకపోయినా,ఆ రోజుల్లోని, పాఠశాలల యొక్క పరిస్థితి,విద్య నేర్పించే విధానం,మన కళ్ళకు కట్టినట్లు వర్ణించి చెప్పాడు.
 తాతయ్య చెప్పిన దాన్ని చూస్తే,ఆ రోజుల్లో పాఠశాలలు, చాలా హీన దశలో వుండేవనీ తెలుస్తూ ఉంది.విద్యార్దులను బాగా దెబ్బలు కొట్టడం, రోజంతా బెంచి మీద నిలబెట్టడం,ఈ విధంగా, పిల్లలకు అతి క్రూరమైన శిక్షలు విధిస్తుండేవారు.మిగితాది రేపు...