ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
November 17, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య దాని పేరు శ్రీ నికేతన్ అని పేరు పెట్టాడు.శ్రీ అంటే లక్ష్మీ,నికేతన్ అంటే నివాసముండే స్థలం. లక్ష్మి నివాసముండే స్థలం అని అర్థం.అది నిజంగా పల్లె ప్రజలకు లక్ష్మి నివాస స్థలమే అయ్యింది.అనేక గ్రామాలు వేల మంది ప్రజలు ఆ కేంద్రాన్ని, ఆదర్శంగా తీసుకుని, దాని సహాయంతో,తమ జీవితాలను చక్కదిద్దుకోగలిగారు.
                     అది1931 సంవత్సరం, తాతయ్యకు 70 ఏళ్ళు నిండాయి.తాతయ్య ప్రత్యేక జన్మదినోత్సవాలకు కలకత్తా నగరంలో సన్నాహాలు జరుగుతున్నాయి.ప్రపంచం అన్ని మూలల నుండి అనేక మంది మిత్రులు రాసిన,వ్యాసాలతో, జన్మదినోత్సవ సంచిక ( commemoration volume) ప్రచురించబడింది.కలకత్తా టౌన్ హాల్ లో గొప్ప సమావేశం ఏర్పాటు చేసి తాతయ్యను ఆహ్వానించారు.అక్కడ తాతయ్యకు ఆ పుస్తకాన్ని సమర్పించారు.
                      తాతయ్య తన జీవితపు చివరి రోజుల వరకు రచనలు సాగిస్తూనే వున్నాడు.1930 సంవత్సరం నుంచి చిత్ర లేఖనం కూడా ప్రారంభించాడు.ఆయన చిత్రించిన అనేక పేయింటింగ్స్ యూరోప్ దేశాలలో కూడా ప్రదర్శించారు.మిగితాది రేపు....