ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
November 18, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్యకు 1940 లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ప్రదానం చేశారు.ఆ సంవత్సరం ఆ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం శాంతి నికేతన్ లోనే జరిగింది.ఈ విధంగా వేరే స్థలంలో స్నాతకోత్సవం జరుపుకోవడం ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం చరిత్ర లోనే అపూర్వం.అప్పటి ఉప రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ ఆ ఉత్సవాన్ని నిర్వహించారు.
                   తాతయ్య 1940లో తన 80 వ పుట్టిన రోజును జరుపుకున్నాడు.ఆ సమయంలో ప్రపంచానికి తన చివరి సందేశం అన్నట్లు సివిలైజేషన్ అనే విషయం మీద తన అమూల్యమైన సందేశాన్ని రాసి ప్రచురించాడు.
                     అంతకు ముందు నుంచే అనారోగ్యంతో బాధపడుతున్న తాతయ్యకు, తనతో కలిసి పని చేసిన మిత్రుడు ఆండ్రూస్, మేనల్లుడు దీనేంద్రనాద్, మరణించడం వల్ల ఆయన మనసు మరింత చెదిరిపోయింది.దినదినం ఆరోగ్యం క్షీణించిపోతూ వుంది.
మిగితాది రేపు.....