ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 18, 2020 • T. VEDANTA SURY • Serial

గుర్రం కంటే సింహం గొప్పది.బలమైనది.అశ్వమేదయాగం కంటే కూడా ఈ యాగం గొప్ప యాగమవుతుందని ఊహించాడు.వెంటనే తాను ఆడుకునే కొయ్య సింహాన్ని కొట్టడం మొదలు పెట్టాడు.మంత్రం లేకుండానే సింహాన్ని బలి ఇవ్వడం ఎలా? మంత్రం లేకుండా పూజ అవుతుందా? మంత్రం ఉండాల్సిందే.
        సింహమా-సింహమా నీ తలను నరికేను
        సింహమా-సింహమా నీవు బలైయ్యేవు.
అని చదువుతూ కొయ్యకత్తితో కొట్టేవాడు.ఇంతకు ముందు చెప్పినట్లు తాతయ్యను కనిపెట్టుకొని వుండే భారం నౌకర్ల మీద వుండేది.ఆ నౌకర్లు పని తప్పించుకునేందుకు అనేక ఉపాయాలు పన్నుతుండేవారు.తాతయ్యను కిటికీ దగ్గర నిలుచో పెట్టి, చుట్టూ సుద్దముక్కతో,గీత గీసి,ఇదిగో! ఈ గీత దాటి బయటకు రావద్దు.వచ్చావా చాలా బాధపడుతావు అని చెప్పేవారు.శ్రీ రామ్ చంద్రుని, తమ్ముడు లక్ష్మణుడు,గీత దాటకూడదని, చెపితే వినక,
గీతదాటిన సీతాదేవి గతి ఏమైందో తెలుసునా? రాక్షసుల చేతిలో 
పడి చాలా బాధ పడింది.కాబట్టి నువ్వు ఈ గీత దాటి బయటకు రావద్దు, అని భయపెట్టి తప్పించుకొని పోయేవారు.మన తాతయ్య చిన్నప్పటి నుండే రామాయణ,భారత కథలన్నీ విన్నవాడు కాబట్టి,ఆ కష్టాలు నిజంగానే వస్తాయని, భయపడి ఆ గీత దాటి బయటకు వచ్చేవాడు కాదు.మిగితాది రేపు...,