ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 25, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య పెద్దవాడైన తరువాత తాను రాసిన 'అనగా అనగా ఒక రాజు'( There was a king),అనే పుస్తకంలో ఇలాంటి ఎన్నో సందర్భాలను రాసారు.ఆ రోజుల్లోనే తాతయ్యకు ఉపనయనం జరిగింది.తాతయ్య నాన్న గారు మహర్షి స్వయంగా ఉపనయనం చేయించారు.అటు తరువాత తాతయ్య ప్రతి రోజూ సంధ్యావందనం చేయడం గాయత్రీ మంత్రాన్ని జపించడం, చూసి ఆయన నిష్ట, భక్తి శ్రద్ధలకు మహర్షి చాలా సంతోషించే వారు.
                 తాతయ్య ఓరియంటల్ సెమినరీ స్కూల్ లో ఎక్కువ కాలం చదవలేదు.ఆ పాఠశాల నుంచి మారి నార్మల్ స్కూల్ లో చేరాడు.నార్మల్ స్కూల్ లో కూడా ఆయనకేమీ ప్రత్యేకత కనిపించలేదు.పాఠాలు మొదలైయ్యే కొంచెం ముందు విద్యార్థులు అందరూ వరుసగా కూర్చొని, కొన్ని పాటలు, భజనలు చదవడం చేసేవారు.అది అక్కడ ప్రార్థన కావచ్చు.ఆ ప్రార్థన ఇంగ్లీషు భాషలో వుండడం మూలంగా, తాతయ్యకు కఠినంగా వుండి, సరిగ్గా చదవడమే కష్టమైపోయేది.స్కూల్లో పాఠాలు చెప్పే మాస్టారులే, తాతయ్యకు ఇంటి దగ్గర కూడా వచ్చి పాఠాలు చెప్పే వారు.ఒకరు బెంగాలీ సాహిత్యం, ఇంకొకరు ఇంగ్లీషు, వేరొకరు భౌతిక శాస్త్రం,వైద్య శాస్త్రం బోధించే వారు.
  ఇంట్లో జరిగే పాఠాలు,స్కూల్ లో జరిగే వాటి కంటే, చాలా ముందుగానే వుండేవి.అప్పటికే తాతయ్య తన వయసుకు మించిన బెంగాలీ గ్రంధాలను చదువుండేవాడు.బెంగాలీ భాషలో గీతాలు రాయడం కూడా మొదలు పెట్టాడు.ఆ స్కూల్ లో ఒక సంవత్సరం ముగిసింది.పరీక్షలు అయిపోయాయి.టాగూర్ తాతయ్యకు బెంగాలీ భాషలో, అందరి కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి.అది చూసి, బెంగాలీ భాష బోధించే మాస్టారు చాలా ఆశ్చర్య పడ్డారు.తరగతిలో ఎన్నడూ ఏ ప్రశ్నకు సమాధానం చెప్పని ఈయనకు, ఇన్ని మార్కులు ఎలా వచ్చాయని,అనుమానపడ్డారు.పరిక్షా పత్రాలు దిద్దిన వారు పక్షపాతం చూపించారనీ అధికారులతో చెప్పుకున్నారు.తాతయ్య మళ్లీ పరిక్ష రాయవలసి వచ్చింది.అప్పుడు పరిక్షల ప్రధాన అధికారి, తాతయ్యను తన ముందే కూర్చుని,పరిక్ష రాయమన్నారు.అప్పుడు కూడా తాతయ్య వెనకబడలేదు.
అందరి కన్నా ఎక్కువ మార్కులే తెచ్చుకున్నాడు.మిగితాది రేపు.....