ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 8, 2020 • T. VEDANTA SURY • Serial

మూడస్తుల బంగళాలోని కింది భాగంలో దివాణానికి సంబంధించిన నౌకర్లు,గుమాస్తాలు వుండేవారు.అతిధులు వస్తే వుండడానికి గదులు,చావళ్ళు వుండేవి.కింది భాగం లోనే ఒక మూల గదిలో పెద్ద పెద్ద నీళ్ళ కడవలు వుండేవి.ఆ రోజుల్లో ఇప్పుడున్నట్లు నీళ్ళ కుళాయిలు వుండేవి కావు.గంగానది నుంచి మంచి నీళ్ళు తెచ్చుకోవలసివచ్చేది.శీతాకాలంలో నదిలో నీరు నిర్మలంగా పారుతూ వుంటుంది.కాబట్టి సంవత్సరానికి సరిపడా నీళ్ళు కాళ్ళతో తెప్పించి ఒకేసారి నిలువ చేసుకునేవారు.
వాళ్ళ దివాణం లో కైలాసబాబు అనే గుమాస్తా పనిచేసేవాడు.తాతయ్యకు ఆయన ఎన్నో చిత్ర విచిత్రాలైన కథలు కల్పించి చెప్పేవాడు.అలాంటి కథలు చెప్పడంలో ఆయన చాలా నేర్పరి.ఆయన చెప్పే కథల్లో బందిపోటు దొంగల కథలే ఎక్కువగా వుండేవి.బందిపోటు దొంగలు ఊరి మీద పడి దోచుకోవడం,రాజ కుమార్తె ను ఎత్తుకు పోవడం, ఊళ్ళు తగలబెట్టడం, ఇటువంటి ఎన్నో చిత్రాలు కల్పించి అప్పటికప్పుడు గుక్క తిప్పుకోకుండా చెపుతుండేవాడు.ఆ కథల్లో దొంగలతో పోట్లాడి తరిమేయడం, వాళ్ళు దోచుకున్న సొత్తు ను తిరిగి తీసుకురావడం,రాజ కుమార్తె ను విడిపించడం,ఈ పనుల కోసం సాహస వీరుడిగా మన తాతయ్య ను కథలో చేర్చి హీరో ను చేసేవాడు. మిగితాది రేపు..,