ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 16, 2020 • T. VEDANTA SURY • Serial

సరే నని చెప్పి,మరి ముసలి గురించి ఏం జరిగింది? అని మళ్ళీ ప్రశ్నించేవాణ్ణి.అబ్దుల్ మళ్ళీ ఆరంభించేవాడు.
నేను సాధారణంగా నీళ్ళల్లో మొసలిని చూస్తూనే వుంటాను.నోరు కొంచెం పైకెత్తుకొని,నీళ్ళలో తిరుగుతూ ఉంటుంది.నదీ తీరాన ఇసుకలో విశ్రాంతిగా పడుకుని,ఎంత చెడ్డగా నవ్వుతుందనుకున్నావ్?అబ్బ చూస్తే,ఎక్కడ లేని భయం వేస్తుంది.నా దగ్గర ఒక తుపాకీ వుంటే, దానితో భేటీ వేసుకునే వాణ్ణి.కాని నా తుపాకీ లైసెన్స్ తేదీ ముగిసిపోయింది.
 చెప్పడం మరిచాను,ఒక రోజు ఏం జరిగిందంటే,కంచి అనే ఒక ఎరుకల మనిషి, నది ఒడ్డున కూర్చుని, కొడవలితో, పుల్లలు కోస్తూ వుంది.ఆమె వెంట వచ్చిన చిన్న మేక పిల్ల, ఆడుతూ, ఆడుతూ నీళ్ళు దగ్గరకు వెళ్ళింది.వెంటనే మొసలి నీళ్ళలో నుంచి పైకి  వచ్చి మేక పిల్ల కాలు పట్టి నీళ్ళలోకి లాక్కపోతూ వుంది.అది చూసి ఆ ఎరుకల మనిషి కంచి ఏం చేసిందంటే! తన కొడవలి తీసుకుని,గబాల్న నీళ్ళలోకి దూకి,మొసలి మీద కూర్చుని, కొడవలితో, దాని గొంతు
కోయడం మొదలుపెట్టింది.మొసలి భయపడి,మేక పిల్ల ను వదిలి పెట్టి,నీళ్ళలో మాయమైంది.
ఆ! తరువాత? తరువాతేమైంది! అబ్దుల్? ఏమవుతుంది?
మిగితా కథంతా, మొసలి తోనే నీళ్ళల్లో మునిగి పోయింది.బయటకు రావడానికి కాస్త సమయం పడుతుంది.ఈసారి నీ దగ్గరకు వచ్చే ముందు పంపి,ఏమైయిందో కనుక్కొని వస్తాను, అప్పుడు చెపుతాను.సరేనా?...... అలా చెప్పి వెళ్ళిన అబ్దుల్ ఇప్పటి వరకు రాలేదు.ఇక ఆ కథ ఏమయిందో మీకు అర్థం అయి వుంటుంది.
ఇది మన టాగూర్ తాతయ్య మేనా కథ.ఒంటరిగా కాలం గడపడంలో ఇది ఒక భాగం.ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు వున్నాయి.అందులో ఒకటి రెండు చెప్పి ముగిస్తాను. మిగితాది రేపు.....