ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
October 5, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య చదువు విషయాన్ని పరిశీలిస్తే,ఆయనకు పరాయి దేశాల్లో, చదివి డిగ్రీలు పోందే, యోగం లేదని స్పష్టంగా కనిపిస్తుంది.కానీ ఆయనకు సహజ కవి హృదయం, మేధస్సు, వున్నాయి.తాతయ్య చిన్నప్పటి నుంచి నిర్బంధం లో పెరిగాడు.చదువు కూడా అదే నిర్బంధం లోనే నేర్పించారు.దానివల్ల స్వాతంత్రం, విశ్రాంతిని కోరుకునే,ఆయనకు ఆ నిర్బంధ విద్య చాలా వెగటుగా తోచింది.కవిత్వానికి, ప్రకృతి సౌందర్యాన్ని కోరుకునే తాతయ్యను,ఓకే రూంలో కూర్చోబెట్టి,చదవమంటే, ఇష్టం ఎందుకు వుంటుంది?
                    స్వతంత్ర జీవనం,స్వంత కృషి,స్వచ్చంధ సాహిత్య సేవ, ఇటువంటి భావాలు తాతయ్యకు తన పూర్వీకుల నుంచి అబ్బిన గుణాలు.తాతయ్య తండ్రి మహర్షి స్వతంత్ర జీవి.స్వతహాగా కష్టపడి పనిచేసి కోటీశ్వరుడు అయ్యారు.యాత్రలు చేసి, దానధర్మాలు,అనేక పుణ్య కార్యాలు, చేసి,దేశ గౌరవాన్ని, ప్రతిష్ట ను,ఇతర దేశాల్లో కూడా చాటి చెప్పారు.ఓకసారి ఒక ఆంగ్లేయ అధికారి, కష్టాల్లో వుండి, సహాయం కోరిన వెంటనే లక్ష రూపాయలు ఇచ్చి,సహాయపడిన,ఉదార పురుషుడు.అలాగే తాతయ్య మహర్షి గుణాలు అన్నీ, పుణికి పుచ్చుకున్నాడు.
              ఇంకా తాతయ్య అన్నలు, వదినలు,అందరూ విద్యావేత్తలు.గొప్ప పేరు పొందిన మహానుభావులు.ఇంతటి సంస్కారం,కలిగిన ఉత్తమ కుటుంబంలో, పుట్టిన తాతయ్యకు ఈ నిర్బంధ విద్య నచ్చలేదు.పాఠాలు, పంతుళ్లు,అంటే విసుగు పుట్టింది.అందుకే స్వంతంగా ఇష్టమొచ్చిన పుస్తకాలు చదువుకొని,విజానార్జన చేయాలనే కోరిక కలిగింది.ఇది కూడా తాతయ్యకు మంచికే జరిగింది.ఒకవేళ తాతయ్యను నిర్బంధాల్లో పెట్టక,మొదటి నుండి కూడా, యదేచ్చగా వదిలి పెడితే, అంతటి మహా పురుషుడు కాలేకపోయేవాడేమో?మిగితాది రేపు......