ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య- ప్రమోద్ ఆవంచ
August 30, 2020 • T. VEDANTA SURY • Serial

జన గణ మన అధినాయక జయహే భారత భాగ్య విధాత
పంజాబు సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్వల జలధి తరంగా
తవశుభ నామే జాగే తవశుభ ఆశిసమాగే
గాయే తవజయ గాథా
జన గణ మంగళ దాయక జయహే-భారత భాగ్య విధాతా
జయహే-జయహే,జయహే,జయ,జయ,జయహే.
భారత దేశపు అదృష్టాన్ని నిర్ణయించే ఓ పరమేశ్వరా!
నువ్వు ఈ విశ్వానికంతటికీ అధికారివి,నాయకుడవు,నీ నామం
పంజాబు, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ,వంగ ప్రాంతాల హృదయాలను, మేల్కొలిపి, వింధ్య,హిమాలయ పర్వతాలలో,ప్రతిధ్వనించి, గంగా, యమునా మహానదుల హోరులో మేళవించి,‌హిందూ మహా సముద్రపు తరంగాల ద్వారా గానం చేయబడుతుంది.నీ ఆశిస్సులను కోరుతూ,నీ విజయ గీతాన్ని పాడుతున్న భారత దేశపు భాగ్యాన్ని నిర్మించే మంగళ ప్రదమైన ఓ పరమేశ్వరా! నీకు జయమగుగాక, నీకు జయమగుగాక, నీకు జయమగుగాక!ఈ గీతం ప్రతి భారతీయుడు జెండా పండుగ రోజు గర్వంగా పాడుకునే మన జాతీయ గీతం.ఈ గీతంలో దేశ గొప్ప తనాన్ని పొగుడుతూ,కవి రవీంద్రనాథ్ టాగూర్ 1912 సంవత్సరంలో బెంగాలీ భాషలో రచించారు.దీనికి ఇంగ్లీషు మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అనువాదాలు ఉన్నాయి.టాగూర్ తాతయ్య ఇలాంటివి ఎన్నో గీతాలు రాశారు.చిన్నతనం నుంచే గీతాలు రాయడం నేర్చుకున్న ఆయన 
అన్నింటినీ బెంగాలీ భాషలోనే రాశారు.
తాతయ్య భారత దేశంలోని పెద్ద నగరాల్లో ఒకటైన కలకత్తా నగరంలో 1861 వ సంవత్సరం మే నెల 7 వ తేదీన జన్మించారు.కలకత్తా నగరంలో అందమైన తోటలు, గొప్ప గొప్ప మేడలు, విశాలమైన మైదానాలు ఎన్నో ఉన్నాయి.అంతేకాకుండా
గొప్ప పండితులు, వ్యాపార వేత్తలు, ఇంకా ఎంతోమంది ధనవంతులు చాలా మంది వుండేవారు.అలాంటి గొప్ప నగరంలో
చిత్ పూర్ రోడ్డున జోరా సంకో వీధిలో ప్రిన్స్ ద్వారకానాధ్ టాగూర్ మనుమడిగా ఓ పెద్ద మేడలో పుట్టినారు.మిగితాది రేపు.....