ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య---ప్రమోద్ ఆవంచ
September 27, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య తన కవిత్వంలో, విషాదం నింపితే బాగుంటుందని ప్రాపంచిక విషాదాలను తన గీతాల్లో రాయడానికి ప్రయత్నించేవాడు.కానీ వాస్తవంగా అప్పటికీ ఆయనకు ప్రపంచంలోనీ విషాదాల గురించి ఏమీ తెలియదు.భక్తి రస గీతాలను రాసి, శ్రావ్యంగా చదివి,వినిపించేవాడు.భక్తి రసఏ గీతాలు రాసి, తాతయ్య నాన్న గారు మహర్షి కి వినిపించేవాడు.
మహర్షి చాలా సంతోషించేవాడు.పూర్వం కవులు రాజుల ఎదుట తమ కవిత్వాన్ని వినిపిస్తే, రాజులు బహుమానాలు ఇచ్చి గౌరవించేవారు.అలాగే మహర్షి, తాతయ్యకు 500 రూపాయలు ఇచ్చి, తాను రాసిన గీతాలను అచ్చు వేసుకోమని చెప్పి సత్కరించారు.
                       ఆ తరువాత తాతయ్యను బెంగాలీ అకాడమీలో చేర్పించారు.అది యూరేషియన్ పాఠశాల.కానీ అక్కడి వాతావరణం తాతయ్యకు ఏమీ నచ్చలేదు.విద్యార్దుల చిలిపి చేష్టలు,ఆటలు తప్ప అక్కడ నిర్మాణాత్మకంగా నేర్చుకున్నదేమీ లేదు.అప్పటి పాఠశాలలు తాతయ్యకు బందీఖానా లాగా తప్ప, ఆయనకు ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు.అందుచేత తాతయ్య స్కూల్ కి వెళ్ళకుండా తప్పించుకు తిరగడానికి బాగా అలవాటు పడ్డాడు.గీతాలు రాయడం, స్వతంత్రంగా సాహిత్యం చదవడం, ప్రకృతి దృశ్యాలను,ఆస్వాదించడం, ఆటలు, పాటలు 
తప్ప క్రమబద్ధమైన పాఠశాల జీవితం తాతయ్యకు ఆసక్తి లేకుండా పోయింది.ఇది గమనించిన తాతయ్య పెద్దన్న, ఆయనను ఇంటి దగ్గరే వుంచి, ఆయనకు ఇష్టం వచ్చినట్టు, విజ్ఞానాన్ని సంపాదించుకునే, ఏర్పాట్లు చేయడం మంచిదని నిర్ణయించారు.అంతటితో తాతయ్య పాఠశాల జీవితం పూర్తి అయ్యింది.మిగితాది రేపు.....