ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య---ప్రమోద్ ఆవంచ
September 20, 2020 • T. VEDANTA SURY • Serial

సోమేంద్రుడు,సత్య, ఇద్దరూ పాఠశాలకు వెళుతుండేవారు.వాళ్ళ వెంట నేను కూడా వెళతాననీ తాతయ్య పోరు పెట్టేవాడట.తాతయ్య కంటే సోమేంద్రుడు రెండేళ్ళు పెద్ద.కాబట్టి వాళ్ళిద్దరిని పాఠశాలకు పంపే వారు.అప్పటికింకా తాతయ్య కు బడికి వెళ్ళే వయసు రాలేదని ఇంట్లోనే వుంచేవారు.ఒకరోజు తాతయ్య బడికి పోతాననీ ఏడ్వడం మొదలు పెట్టాడు.అప్పుడక్కడ వున్న వాళ్ళలో ఒకరు, ఇప్పుడు బడికిపోతాననీ ఏడుస్తున్నట్టు, మునుముందు ఇంట్లోనే వుంటాననీ,ఏడవాల్సి వస్తుంది, జాగ్రత్త అని అన్నాడట.మన తాతయ్య విషయం లో ఆ మాట జ్యోతిష్యం చెప్పినట్లే, జరిగింది.
తాతయ్య ఇంట్లోనే వుండాలనీ, బయటకు వెళ్ళకూడదని, నియమం వుండడం వల్ల, బయట ఏముందో చూడాలన్న,కోరిక రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది.అందువల్ల బడికి పోతాననే నెపంతో నైనా, బయటకు వెళ్లి తిరగవచ్చని తాతయ్య ఉపాయం.
                       ఒకసారి కలకత్తా నగరంలో, జ్వరాలు వ్యాపిస్తే, ఇల్లు వదిలి, గంగా నది తీరంలో, కొన్ని రోజులు తాతయ్య కుటుంబమంతా కాపురమున్నారు.ఆ రోజు తాతయ్య కు కలిగినంత సంతోషం, బహుశా, మరెవ్వరికీ ఎప్పుడూ కలగలేదని చెప్పొచ్చు.ఉదయాన్నే లేచి తోటలోకి పరిగెత్తే వాడు.కమ్మని పూల వాసన, పచ్చని గడ్డి మీద, ముత్యాల వలే,మిల మిల మెరుస్తున్న తెల్లని మంచు బొట్లు, అది చూసిన తాతయ్య మనసు ఆనందంతో ఉప్పొంగిపోయేది.చాలాసేపు ఆ మంచులో ఆడుకొని, తిరిగి వచ్చేవాడు.మిగితాది రేపు...