ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య---ప్రమోద్ ఆవంచ
September 5, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య అక్కయ్య స్వర్ణ కుమారి దేవి అప్పట్లో స్కూలుకు వెళ్ళి బాగా చదువుకున్న మొట్టమొదటి మహిళ.ఆమె నవలలు రాసేది.అనేక గ్రంథాలు చదివింది.అంతే కాకుండా పత్రికా సంపాదకత్వం కూడా చేసింది.బంకించంద్రచటర్జీ లాంటి ప్రముఖులు ఆమెను ఎంతగానో మెచ్చుకున్నారు.
ఇలా ఆ ఇల్లు  గొప్ప రచయితలు, కవులు, పండితులు, కళాకారులతో కళకళలాడుతూ అష్టైశ్వర్యాలతో తులతూగుతూవుండేది.అలాంటి ఇంట్లో పుట్టిన తాతయ్య కు విద్యా,వినయ సంస్కారాలకు, కవిత్వ పాండిత్యాలకు కొదువేముంది.
తాతయ్య నాన్న గారు మహర్షి, దైవభక్తి, ధ్యానం, సంస్కారం, గొప్ప తపోశ్శక్తి కలిగిన మహా వ్యక్తి.ప్రాపంచిక విషయాలలో ఆయన గొప్ప జ్ఞానం వుండేది.తన మాతృభాష లోకి, ఋగ్వేదం లాంటి మహా గ్రంధాన్ని, మరికొన్ని ఉపనిషత్తులను కూడా అనువాదం చేసుకున్న గొప్ప మేధావి.తాతయ్య అన్నలందరూ విద్యావంతులు,అక్క, వదినలు,సంగీత, సాహిత్య, సాంఘీక,కళా నైపుణ్యాలలో పేరు పొందారు.ఇంకేం కావాలి తాతయ్య కు శిక్షణ, శిక్షణ కు కావలసిన అనుకూల వాతావరణం,సదావకాశాలు అన్నీ ఆయనకు అందుబాటులో వుండేవి.అందువల్లనే తాతయ్య సహజ కవిత్వం, పాండిత్యం, నాట్యం,గానం,లౌకికం, ధర్మం, న్యాయం, మొదలైన విషయాలలో ప్రతిభావంతుడయ్యాడు.సాదారణ జీవితం గడుపుతూ, దైవభక్తి తో పూజలు చేస్తూ, అందరికి దానధర్మాలు చేస్తుండేవాడు.నృత్య,సంగీత సాహిత్య,చిత్రకళ లను నేర్చుకుంటూ, ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించేవాడు మన తాతయ్య. హృదయం లో విశ్వ మానవ ప్రేమ,విద్యా వినయ సంస్కారాలు,తన కుటుంబం నుంచి నేర్చుకున్నాడు.అందుకే తాతయ్య గురుదేవులై, మహర్షి యై,విశ్వకవియై,విశ్వ మానవ ప్రేమికుడై, విశ్వ విజేత అయ్యారు.మిగితాది రేపు......