ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య---ప్రమోద్ ఆవంచ
October 3, 2020 • T. VEDANTA SURY • Serial

జ్యోతీంద్రుడు కూడా బెంగాలీ సాహిత్య సంచికను ప్రారంభించారు.ఆ పత్రికకు భారతి అని పేరు పెట్టారు.తమ పెద్దన్న ద్విజేంద్రనాధ్ ను ఆ పత్రికకు ఎడిటర్ గా వుండమని కోరారు.ఇప్పుడు తాతయ్యకు చేతి నిండా పని,కోరినన్ని గీతాలు, ఇష్టమొచ్చినన్ని కథలు, వ్యాసాలు రాసి అచ్చువేసుకోవచ్చు.తాతయ్య యూరోప్ సాహిత్యం గురించి,ఇటలి దేశపు గొప్ప కవుల గురించి వరుసగా భారతి లో వ్యాసాలు రాస్తుండేవాడు.కొద్ది రోజుల్లోనే తాతయ్య ఆ పత్రికకు కార్యనిర్వాహక సభ్యుడిగా నియమితులయ్యారు.ఈ ఎంపిక విధానాన్ని చూస్తే, తాతయ్య తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం లో ఎంతటి శ్రద్ధ,కనబరిచాడో అర్థమవుతుంది.తాతయ్యకు సాహిత్యం తో పాటు, సంగీతం లో కూడా ఎంతో ఆసక్తి వుండేది.జ్యోతీంద్రుడు పియానో మీద సంగీతం సాధన చేస్తుండేవారు.ఆయనను తాతయ్య అనుసరించేవాడు.
                       తాతయ్య తన పదిహేడో ఏట,తన రెండవ అన్న సత్యేంద్రుడు వద్ద వుండడానికి వెళ్ళాడు.ఆయన అప్పుడు అహ్మదాబాద్ లో వుంటుండేవారు.సత్యేంద్రుడు సెలవు తీసుకుని, ఇంగ్లాండ్ వెళ్ళాలనుకొని, తాతయ్యను కూడా తన వెంట తీసుకెళ్ళాలని అనుకున్నారు.అప్పటి నుంచి తాతయ్యకు ఇంగ్లీష్ సాంప్రదాయాలు నేర్పించారు.మిగితాది రేపు....