ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-- -ప్రమోద్ ఆవంచ
September 6, 2020 • T. VEDANTA SURY • Serial

తల్లి ప్రేమ అపురూపమైనది.పిల్లల పెంపకంలో చూపించే శ్రద్ధ,ఆ ఓపిక దేవుడు ఒక్క అమ్మకు మాత్రమే ఇచ్చాడు.వాళ్ళకు స్నానం చేయించడం, బట్టలు తొడగడం, భోజనం పెట్టడం, ఎత్తుకోవడం, తిప్పడం,ఈ పనులన్నీ ఎంత కష్టమో తల్లులకే తెలుసు.కానీ తాతయ్య అమ్మ, ఎక్కువ సమయం తన భర్త సేవలో,ఇతర ఇంటి పనుల్లో, వుండడం వల్ల మన తాతయ్య పోషణ గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోలేదు.ఆయన పోషణ భారమంతా ఇంటి నౌకర్ల పైనే వుండేది.కానీ పనివాళ్ళు కు శ్రద్ధ ఎందుకు వుంటుంది.ఏదో విధంగా పిల్లలను,మరిపించో, లేదా భయపెట్టో,పని తప్పించుకునేందుకు చూసేవారు.పనులన్నీ నౌకర్లే చూసుకున్నా, తాతయ్య మంచి చెడ్డలు ఆయన అన్నలు, వదినలు చూసుకునేవారు.
                    తాతయ్య ఇంట్లో అందరూ చదువుకున్న వారే.ఒక్కొక్కరు అనేక విద్యలలో ఆరితేరిన వారు.టాగూర్ కుటుంబం చాలా ధనవంతులు అయినప్పటికీ,జీవిత విధానాలు మాత్రం చాలా నిరాడంబరంగా వుండేది.పిల్లలకు అనవసర ఆడంబరాలు ఉండేవి కావు.పది సంవత్సరాలు దాటే వరకు సామాన్యమైన దుస్తులు, క్రమబద్ధమైన ఆహార అలవాట్లు, ఇంకా ఎన్నో కట్టుదిట్టాలు వుండేవి.
                       తాతయ్య కు కథలంటే చాలా ఇష్టం.మంచి కథలు చెప్పే వారుంటే,ఎంత సేపైనా శ్రద్ధగా వినేవాడు.సాహసాన్ని తెలియజేసే కథలంటే ఆయనకు భయం వుండేది కాదు.నిజమైన కథల కంటే కల్పిత కథలు అంటేనే ఆయన ఇష్టంగా వినేవాడు.తాతయ్య అమ్మ గారు ప్రతిరోజూ రామాయణం,చదువుకునేది.అలా చిన్నతనం నుంచే తాతయ్య కు రామాయణ,భారత, భాగవతం లోని కథలు నేర్చుకున్నాడు.
           మిగితాది రేపు......