ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-- -ప్రమోద్ ఆవంచ
October 4, 2020 • T. VEDANTA SURY • Serial

అహ్మదాబాద్ ఒక పురాతన కాలపు పట్టణం.అక్కడ పూర్వకాలపు భవనాలు, సంస్కృతి,కళ, సంస్కారం, కళ్ళకు కట్టినట్టు కనబడుతాయి.తాతయ్య అన్న వుండే ఇల్లు పూర్వ రాజుల గొప్ప భవనాల్లో ఒకటి.విశాలమైన గదులు, అందులో చిత్రాలు, అప్పటి నిర్మాణాల పద్దతి చూస్తే,ఆ కాలపు రాచఠీవి, సాంప్రదాయాలు, మనకు అర్థం అవుతాయి.ఆ దృశ్యాలకు ప్రభావితమైన తాతయ్య, కొన్ని రోజుల తరువాత,హంగరీ స్టోన్స్(Hungry stones),అనే పుస్తకాన్ని రాసాడు.
                          తాతయ్య తన అన్న తో 1878లో ఇంగ్లాండ్ కు వెళ్ళిన తరువాత, అక్కడ ఆయన ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే వున్నాడు.ఇంగ్లాండ్ పరిస్థితులను చూసి, అనుభవం సంపాదించడం తప్ప, క్రమంగా, ఏదైనా పాఠశాలలో చదివి పరిక్షలు పాసై, డిగ్రీ సంపాదించడం జరగలేదు.ఆ తరువాత తాతయ్య ఇండియా కు తిరిగి వచ్చేసాడు.
                 ఆ తరువాత 1881 సంవత్సరంలో, తాతయ్యను మళ్లీ ఇంగ్లాండ్ పంపించి, లాయర్ చదివించాలని, కుటుంబ సభ్యులు నిర్ణయించారు.అనుకున్నట్లు గానే,సత్యేంద్రుడు తోడుగా, తాతయ్యను లండన్ పంపించారు.కాని, రెండు, మూడు రోజులు ప్రయాణం చేసిన తరువాత సత్యేంద్రుడు జబ్బు పడడంతో, మద్రాసు నుంచి రైలు మార్గం లో ఇంటికి రావలసి వచ్చింది.తాతయ్యకు కూడా లండన్ వెళ్లి, చదువుకోవడం ఇష్టం లేకపోవడం వల్ల, ఇంటికి వచ్చాకా తండ్రికి ముఖం చూపించేందుకు, సిగ్గు పడ్డాడు. అనుభవజ్ఞులైన మహర్షి, కొడుకు మనోగతం అర్థం చేసుకున్నారు.మిగితాది రేపు....