ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగోర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
September 1, 2020 • T. VEDANTA SURY • Serial

దేవేంద్రనాద్ టాగూర్ తన సంతానాన్ని రాజ భోగాలతో పెంచారు.తన పిల్లలకు ఎలాంటి సమస్యలు లేకుండా పెంచాడు.అలా ఆయన ఉదార గుణం వల్ల ఆయన మరణించే నాటికి అప్పుల బాధ పెరిగిపోయింది.దాదాపు కోటి రూపాయలు అప్పుల కింద చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.అప్పుడు మన తాతయ్య నాన్న గారు మహర్షి దేవేంద్రనాద్ టాగూర్ తన సంపాదన అంతా అమ్మి బాకీలు తీర్చివేయడానికి నిశ్చయించుకున్నాడు.తనకున్న సంపాదనంతా
ఒక కాగితం లో రాయించి,అప్పులవారినందరిని పిలిపించాడు.
వారికి ఆ కాగితాన్ని ఇచ్చి,ఈ ఆస్తులను అమ్ముకొని మీ అప్పులను తీర్చుకోమని చెప్పాడు.కానీ వాళ్ళు ఆ పని చేయడానికి ఇష్టపడలేదు.నెమ్మది, నెమ్మదిగా బాకీలు తీర్చమని చెప్పి వెళ్ళిపోయారు.మిగితాది రేపు....