ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగోర్ తాతయ్య : - ప్రమోద్ ఆవంచ
September 2, 2020 • T. VEDANTA SURY • Serial

ఇలా కొంతకాలం వరకు బాకీలు తీరుస్తూ, అనేక సంస్థలకు దానధర్మాలు చేస్తూ,తన తండ్రి ఇస్తానని మాట ఇచ్చిన విరాళాలు కూడా చెల్లిస్తూ మహర్షి దేవేంద్రనాద్ టాగూర్ తమ వంశ గౌరవాన్ని నిలబెట్టాడు.ఎన్నో దానధర్మాలు చేస్తూ తండ్రి కి తగ్గ తనయుడు అనిపించాడు.తన దగ్గరకు ఎవరైనా వేస్తే ఉత్తి చేతులతో వెళ్ళేవారు కాదు.అలా ఆయన తన జీవిత కాలంలో దాదాపు 22 లక్షల రూపాయలు దానం చేసారు.
  ఏ పనిలో అయితే సౌఖ్యం కలుగుతుందో ఆ పనిని జీవితాంతం చేయాలని మహర్షి దేవేంద్రనాద్ టాగూర్ చెపుతుండేవారు.ఆయన దైవభక్తి,స్వదేశ ప్రేమ, మొదలైన గొప్ప ఆశయాలు పాటిస్తూ,తన పేరును సార్ధకం చేసుకున్నారు.
సంస్కృతం, బెంగాలీ భాషలోని అనేక గ్రంథాలను చదివి ఋగ్వేదం, ఉపనిషత్తులను బెంగాలీ భాషలోనికి అనువాదం చేసారు.
               బెంగాలీ భాషలో వచన సాహిత్యం అంటే మహర్షి కి చాలా ఇష్టం.దీనికి పెద్ద ఉదాహరణ ఆయన ఆత్మకథ.మహర్షి దేవేంద్రనాద్ టాగూర్ 1905 లో జనవరి 19 న,తన 89 సంవత్సరాల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.మిగితాది రేపు......