ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టీచర్ ఎలా ఉంటే మాకు ఇష్టం--కందేపి సృజన్\
October 28, 2020 • T. VEDANTA SURY • Talent

హలో నా పేరు కే సృజన్ నేను కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పదో తరగతి చదువుతున్నాను. ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక వ్యక్తి మరణిస్తాడు ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక వంతెన కూలిపోతుంది కానీ ఒక టీచర్ తప్పు చేస్తే భవిష్యత్తు జాతి నిర్వీర్యమై పోతుంది అని పెద్దలంటారు. అది అక్షరాల నిజం కాబట్టి టీచర్లు ఎటువంటి తప్పులు చేయకుండా పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి. పిల్లలతో వ్యవహరించేటప్పుడు అలవాట్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాట ధోరణి కూడా సరిగ్గా ఉండాలి.పదజాలంలో తిట్లు వంటివి ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే పిల్లలు టీచర్లను అన్ని విషయాలలో అనుకరిస్తారు కనుక.

టీచర్లు పక్షపాత ధోరణి లేకుండా ఉండాలి చాలా మంది టీచర్లు క్లాసులో బాగా చదివే విద్యార్థులను మాత్రమే ప్రోత్సహిస్తూ తక్కువ మార్కులు వచ్చే వారిని చిన్నచూపు చూస్తూ ఉంటారు.అంతేకాదు స్కూల్ లో జరిగే వార్షికోత్సవాలు తదితర కార్యక్రమాలలో ర్యాంకర్ లకే అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. కేవలం చదువులో ఫస్ట్ ర్యాంక్ రానంత మాత్రాన మిగిలిన రంగాలలో ప్రావీణ్యం లేదు అనుకోవడం పొరపాటు. ఆసక్తి ఉన్నవారందరికీ ఆటలు పాటలు స్టేజ్ ప్రోగ్రామ్స్ లలో అవకాశం కల్పించాలి.అలాగే తక్కువ మార్కులు వచ్చాయి అని హేళన చేయకుండా లోపం ఎక్కడుందో జాగ్రత్తగా తెలుసుకొని వాటిని సరిదిద్దాలి. పిల్లల మనసులను గాయపరచకుండా చదువు పట్ల జిజ్ఞాసను కలిగించే టీచర్ల అంటే మాకు ఇష్టం. ఇంత మంచి శీర్షికను ఏర్పాటు చేసి ఈ అవకాశాన్ని కల్పించిన మొగగకు నా ధన్యవాదాలు