ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
డా.అందె వెంకటరాజం వర్ధంతి నేడు --మాడిశెట్టి గోపాల్ కరీంనగర్
September 11, 2020 • T. VEDANTA SURY • News

అష్టావధానిగా , భారత సాహితి సమితి సంస్థ నిర్వాహకులుగా , కావ్య నాటక రచయితగా , సంస్కృతాంధ్ర భాషా పండితునిగా , పూర్వ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యునిగా , జ్యోతిష వాస్తు శాస్త్ర విద్వాంసునిగా, అవధానిగా తనదైన సాహిత్య జీవన శైలితో పూర్వ కరీంనగర్ జిల్లాకు ఖ్యాతిని ఆర్జించిపెట్టిన డా.అందె వెంకటరాజం వర్ధంతి నేడు 
ఆయనను స్మరించుకుందాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశస్తి గాంచిన కోరుట్ల పట్టణం లో  డా .అందె వెంకటరాజం భూదేవి లింబయ్య దంపతులకు 14-10-1933 రోజున కనిష్ట సంతానంగా జన్మించారు . రాత్రివేళ ఆయన నాన్న గారు వచన భారతం , తత్వ కీర్తనలు , యక్షగానాలు , చదివి వినిపించుటవలన , మరియు ఆయన పెద్దన్న ప్రేమతో శతకాలు మొదలగు పుస్తకాలు కొని ఇవ్వడం వలన పాఠ్య పుస్తకాలతో పాటు పాటలకు పద్యాలకు సంబంధించిన అనేక పుస్తకాలను పఠించేవారు . 10 వ తరగతి వరకు  జగిత్యాలలో చదివి అనంతదరం స్వర్గీయ డా. సి.నారాయణ రెడ్డి గారి ప్రోత్సాహంతో బి. ఓ. ఎల్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. హెచ్చెస్సీ పాసైన తర్వాత అందె వేంకటరాజము నిజామాబాద్ జిల్లాలోని భిక్కునూర్‌లో ఉపాధ్యాయులుగా చేరాడు. ఇతడు మొదట ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. తర్వాత తెలుగు భాషా పరీక్షలను రాసి తెలుగు పండితుడు అయ్యాడు. ఆనాటి తెలుగు భాష పాఠ్యగ్రంథాలు గ్రాంథిక భాషలో ఉండేవి. వాటిని చదివి గ్రాంథిక భాషలో కవిత్వం రాయడం నేర్చుకున్నాడు. అయినప్పటికీ చిన్నప్పటినుంచి చుట్టూ ప్రజలు పాటలు పాడడం విని తాను ఎన్నో పాటలు కట్టాడు. కాని పాటకు పాఠ్యపుస్తకాల్లో సాహిత్య గౌరవం లేకపోవడంతో దాన్ని అలానే వుంచి పద్యం రాయడం నేర్చుకున్నాడు.అష్టావధాన ప్రక్రియలో ప్రవేశించి 88 అష్టావధానాలను పూర్తిచేశాడు.  వానమామలై వరదాచార్యుల కృతులపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు . కళాశాలలో ఆంధ్రపన్యాసకులుగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు . అందె వారు చిన్న నాటి నుండే కవిత్వంపట్ల ఆకర్షితులైనారు . ఒకానొక సందర్భంలో సినారె  నాగార్జున సాగరం గేయ కావ్యంలోని రసవద్ఘట్టాలు వినిపించగా అది విని వారి  గళమాధుర్యానికి ముగ్ధులై వారిని గురువుగా హృదయ పీఠం పైన ప్రతిష్టించుకున్నారు . అప్పటి నుండి తరచుగా కలవడం ద్వారా , ఉత్తరాల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకుంటూ అద్భుతమైన సాహిత్యాన్ని సృజియించారు. 
ఇతడు ఎం.ఏ చదివాడు. కాకతీయ విశ్వవిద్యాలయంలో వానమామలై వరదాచార్యులవారి కృతులు-అనుశీలనము అనే సిద్ధాంతగ్రంథాన్ని సమర్పించి డాక్టరేట్ పట్టా పొందాడు. కోరుట్ల డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేసి 1992 జూన్ 30వ తేదీన రిటైరయ్యాడు. గృహవాస్తు పండితుడిగా కూడా ఇతడు రాణించాడు.

అందె వేంకటరాజము వచన కవిత తప్ప మిగతా సాహిత్య ప్రక్రియలన్నీ చేపట్టాడు. నాటకాలు రాశాడు. పాటలు రాశాడు. సాహిత్య విమర్శ రాశాడు. దాదాపు డెబ్భయి కథలు రాశాడు. అర్థరాత్రి సుప్రభాతం, పసివాని మూడో పెళ్ళి, మైసమ్మ భయం, అంగడి వింతలు, విచిత్రమైన భక్తురాలు మొదలైన కథలు కొన్ని ఉదాహరణలు

*ఇతడు రచించిన పుస్తకాలు*

నవోదయము (కవితాసంపుటి)
మణిమంజూష (కవితాసంపుటి)
భారతరాణి (నాటికల సంపుటి)
భువనవిజయము (నాటిక)
వానమామలై వరదాచార్యుల వారి కృతులు - అనుశీలనము (సిద్ధాంత గ్రంథము)
మానసవీణ (కవితాసంపుటి)
ఈశ్వర శతకము
మాధవవర్మ (నాటకము)
సాహితీ జీవన తరంగాలు (సాహిత్యవ్యాసాలు)
అవధాన పద్యమంజరి
కళాతపస్విని (కావ్యము)
భజన గీతాలు
శ్రీ గోవిందగిరి తత్వ గీతమాల
నింబగిరి నరసింహ శతకము
విచిత్రగాథలు
స్వర్ణ భారతము (పాటల సంపుటి
కవిశిరోమణిఅవధాన యువకేసరిఅవధాన చతురానన తదితర బిరుదులు పొందారు.  *సెప్టెంబరు 11 సోమవారం 2006న* తన 73వ యేట మరణించాడు.ఆయనకు  నివాళులు*