ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
డా.కూచిభొట్లశివరామకృష్ణయ్య--డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.9884429899.
October 10, 2020 • T. VEDANTA SURY • News

 

వేదికనుండి-వెండితెరకు.
కళలు మానవకళ్యాణం కల్యాణం కొరకు సృష్టించబడినవి.వందల సంవత్సరాలుగా  మానవుడి జీవితంలో భాగమై పోయాయి.ప్రజావళికి ఆనందాన్ని,విజ్ఞానాన్ని ,అందించే కళాకారులు ధన్యజీవులు.
29/3/1969 లో విడుదలైన'లవకుశ'చిత్రంలో గిరిజ తండ్రిగా నటించి 'వల్లనోరిమామ నీపిల్లని'పాటలో కనిపించే శివరామకృష్ణయ్యగారు 1899ఆగస్టు 28 న కృష్ణాష్టమినాడు గుంటూరుజిల్లా లోని తెనాలిలో జన్మించారు.
విశాఖపట్నంలో మెడిసన్ చదివేరోజుల్లో ఒనాటక సమాజంలో చేరగా ప్రముఖరంగస్ఢల నటుడు 'కొచ్చర్లకోటరంగారావు'గారిపరిచయంకలిగింది.అప్పుడు 'జగన్మిత్రనాటకసమాజం'వారినాటక ప్రదర్మనలలో ?,జయపురంరాజా విక్రమదేవవర్మ,బాకురాపాండవెంకటరావు,వంటిప్రముఖ రంగస్ధలనటులు మంచి గాత్రంకలిగిన  శివరామకృష్ణయ్యగారిచే వేదికపై పాటలు పాడించేవారు.అలా రంగస్ధలం పరిచయం వీరికి జరిగింది.అనంతరం1923 లోవీరు ఎల్ .ఎమ్ .పి.పట్టాపొందారు.స్వంతంగా ప్రాక్టీస్ పెట్టి వైద్యం చేస్తూనే ,నాటకరంగానికి సమయంకేటాయించేవారు.అప్పుడేబళ్ళారిరాఘవా,యడవల్లి,డి.వి.సుబ్బారావు,మల్లాదిగోవిందశాస్త్రి,రాళ్ళబండి,కొచ్చర్లకోట,జొన్నవిత్తుల,దైతాగోపాలం,గోవిందరాజులవెంకట్రామయ్య,పారుపల్లిసుబ్బారావు,అద్దంకి,సూరిబాబు,మాధవపెద్ది,    గోవిందరాజులసుబ్బారావు,రఘరామయ్య,రాజేశ్వరి  వంటిప్రముఖరంగస్ధలనటుల సరసన నటించారు.అప్పుడు తెనాలిలో కొంగరసీతారామయ్యగారిహాలులో పలుప్రదర్మనలుయిచ్చారు.దుర్యోధనుడిగా,రామదాసు,బహుక,చాణిక్య,దుష్ఠబుద్ది,హిరణ్యకస్యపక,రాజరాజనరేంద్ర,బుస్సి,పేరిగాడు,విజయరామరాజు,జనార్ధనమంత్రి,కబీరు,కణ్వుడు,సత్యవంతుడు,భరతుడు,అర్జునుడు,కాశీపతి వంటిపలు పాత్రలు ధరించి వాటికి వన్నె తెచ్చారు.
1923-52 వరకు వైద్యవృత్తిలో కొనసాగారు.'లక్ష్మిఫిలింస్ 'వారునిర్మిస్తున్న'ద్రౌపతిమానసంరక్షణము'1936 లోఈచిత్రంలో కర్ణుడి పాత్రద్వారా తొలిసారి చిత్రరంగానికి పరిచయం అయ్యారు.ఇదేచిత్రంలో శ్రీకృష్టుడిగా బందాకనకలింగేశ్వరరావు,దుర్యోధనుడుగా బళ్ళారిరాఘవా,భీమునిగా మునిపల్లేసుబ్బయ్యవీరు(తెలుగుచిత్రాలలోతొలిసారిద్విపాత్రాభినయంచేసిననటుడు చిత్రం 'సతిసులోచన'1936)ద్రౌపతిగా సురభికమలాబాయి(పాతాళభైరవిచిత్రంలో తొటరాముడితల్లి )గార్లునటించారు.
అనంతరం'నవాబితుగ్లక్ '(1941) 'జీవన్ ముక్తి' 'భలేపెళ్ళి'(1942)పలుచిత్రాలలో నటించి అనంతరం మిలటరీలో కెప్టెన్ గా అస్సాంలో పనిచేసారు.అనంతరం గుంటూరులోవైద్యవృత్తికొనసాగిస్తు,విజయావారి'పెళ్ళిచేసిచూడు'(1952)'పెళ్ళిసందడి'(1959) 'వారసత్వం(1964)వంటి దాదాపు రెండువందలచిత్రాలలో నటించారు.
నాటకరంగంలోఏనాడుడబ్బుతీసుకోలేదు,కేవలంకళాభిమానంతోనేనటించేవారు.పేదకళాకారులకు తనవంతు ఆర్ధిక సహాయం అందించేవారు.ఆనాటి నైజాంనవాబు పాలనలో ఉన్న రేడియోలో తనుహర్మోనియం వాయిస్తు అనేకపాటలు,పద్యాలు పాడారు.అనేక పద్యాలు గ్రాంఫోన్ రికార్డులుగా యిచ్చారు.అనేకరేడియో కార్యక్రమాలలోపాల్గోన్నారు.నటనలో అలుపు ఎరుగని ఈకళామూర్తి తనఎనభైవఏట మద్రాసునగరంలో నవంబర్ మాసంలో తన తుదిశ్వాస విడిచారు.