ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తంజావూరు రాజుల పరిపాలనలో తెలుగు సాహిత్యము గురించి తెలుసుకునే ప్రయత్నంలో వాగ్గేయకారులు గురించి తెలుసుకోవలసిన అవసరంఉంది. వారిలో ఇద్దరు ముఖ్యులు. వారే క్షేత్రయ్య, త్యాగయ్య. వీరి గురించి తెలియని వారుండరు. త్యాగయ్య అనే త్యాగరాజు తమిళనాడులో జన్మించినప్పటికీ తెలుగు వాగ్గేయకారుడు. తండ్రి కాకర్ల రామబ్రహ్మం, తల్లి సీతమ్మల మూడవ సంతానం ఈయన క్రీ.శ.1767లో జన్మించినట్లు తెలియుచున్నది. వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లా కంభం మండలం లోని కాకర్ల గ్రామము నుండి తరలి వెళ్ళిన కుటుంబము అని అంటారు. త్యాగయ్య తల్లి లాలన పాలనలో భక్తి సంగీతంఅలవడింది. శ్రీరామునిపై అపార భక్తి అలవడింది. వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని తండ్రి బోధించడం జరిగింది. ఈయనకు 18వ యేట రామకృష్ణానంద పరబ్రహ్మ ఉపదేశించారు. ఈ ఉపపదేశానుసారం, ఇతడు నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన మహనీయుడు. ఈ కాలంలోనే శ్యామస్వామి, ముత్తుస్వామి దీక్షితులు అను ఈ ఇద్దరితో వాగ్గేయకార త్రయంగా ప్రసిద్ధి చెందాడు. ఇతని కీర్తనలు ఆంధ్ర‌ ప్రదేశ్ కంటే తమిళనాడులోనే ఎక్కువ ప్రసిద్ది చెందాయి. త్యాగయ్య సుమారు 900 వరకు కీర్తనలు రచించాడని అంటారు. ఈ కీర్తనలు రాగం, తానం పల్లవితో అలరిస్తాయి. ఈయన వ్రాసిన ఈ కీర్తన పదచరణం "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" కీర్తిన వీనుల విందుగా ఉంటుంది.సభలలో ఉపన్యాసకులు, సభికులనుద్దేశించిఈ చరణం ఉపయోగిస్తూ, ప్రణామాలు తెలియజేస్తారు. మరో కీర్తిని "జో జో..రామా...రఘుకులతిలక... ..." అనే కీర్తన మకుటం బాల సాహిత్యంలోనేటికీ చాలా గేయాలకు మకుటంగా శోభాయ మానంగా విరాజిల్లుతోంది. మరో కీర్తిన ఇటువంటిదే"రారే, రారే, పిల్లల్లారా! బొమ్మలు పెళ్ళి చేద్దాం" బృందగానం బాల గీతమై నేటికిని ఒక అనుసరణ మకుటమైనది. "తెర తీయగా రాదా!వేంకటేశా!నిను సేవింప"వంటి కీర్తనలు అనేకం ఉన్నాయి. ఇవి విశేషప్రచారం పొంది ఉన్నాయి.ఈ రోజుల్లో త్యాగరాజు కీర్తనలు దక్షిణాది అంతట, అనేక ఉత్సవాలలో నేటి బాలల ముచ్చటైన నాట్యాలతో అలరిస్తూ ఉండడం మనం చూస్తునే ఉన్నాం.నేటికి ఏటా త్యాగయ్య ఆరాధనోత్సవాలుజరుగుతునే ఉన్నాయి.ఈ కాలంలోనే తంజావూరు సంస్థానాలు అంతరించిపోయాయి. ఆ పిమ్మట మధుర పుదుక్కోట సంస్థానాలు కవులకు ఆశ్రయం అయ్యాయి. మధుర నాయకుల్లో మొదట ఆంధ్ర కవులను ఆదరించి సత్కరించిన వాడు ముద్దళ గిరి. (శతాబ్ది ఉత్తర భాగము) ఇతని పేర అంకితము చేయబడిన కృతులు మూడు కనబడుతున్నవి. మొదటిది పెద్దళ్గరి విజయము. ఇది తంజావూరు కోట నాలుగు గోడలపై చెక్కబడిన 530 పాదములు గల ఉత్పల మాలిక ముద్దళ గిరి మహారాష్ట్రుడైనఏకోజీని ఓడించి పొందిన విజయములు వర్ణింపబడినవి. అళగిరికి అంకితమైన రెండవ గ్రంథం తిరుకామకవి అను నామాంతరం గల లింగనమఖి కామేశ్వర కవి రచించిన సత్యభామా స్వాంతనం. ఇందలి కథ నరకాసుర సంహారం. మద్దళగిరి కృతి నందిన మూడవ కృతి విద్యావతీ దండకం. దీనిని రచించిన వాడు గణపపరపు వేంకటకవి. ఇతడు బహుగ్రంధకర్త అపారమైన పాండిత్యం అద్వితీయమైన శాస్త్ర విజ్ఞానం, అనంతమైన లోకానుభవం కలిగి కర్ణాటక తుండీర చోళ పాండ్య మండల ప్రముఖ మండల అఖండులచే సత్కారములు పొంది యుండెను. (సశేషం) ( ఇది 76వ భాగం)- బెహరా ఉమామహేశ్వరరావు- 9290061336
July 29, 2020 • T. VEDANTA SURY • Serial