ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తప్పు--డి.కె.చదువుల బాబు
September 29, 2020 • T. VEDANTA SURY • Story

సుజాత ,గోవిందరావుల ఏకైక కూతురు సరళ.ఆరవ తరగతి చదువుతోంది.ఙ్ఞాపకశక్తి తక్కువ.చదువు లో కొంచెం వెనుకబడి
ఉండేది.బాగా చదవమని,మంచిమార్కులు రావాలని తల్లిదండ్రులు ఒత్తిడిచేసేవారు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని తిట్టారు.కొట్టారు.ఇకముందు మార్కులు తక్కువొస్తే వీపుచీరేస్తామని బెదిరించారు.అలా దండించటంవల్ల బాగా చదివి,గుర్తుంచుకుంటుందని భావించారు.సరళకు తల్లిదండ్రులంటే,పరీక్షలంటే భయం పట్టుకుంది.
    ఆరునెలల పరీక్షలు పూర్తయ్యాయి.విద్యార్థులకు ప్రగతి పత్రాలిచ్చారు.తల్లిదండ్రులకు చూపించి సంతకం చేయించుకుని రమ్మన్నారు.తక్కువ మార్కులు రావటంతో సరళ వణికిపోయింది.అమ్మ,నాన్న కొడతారని భయపడింది.ఆలోచిస్తే ఓ ఆలోచన తట్టింది.ప్రగతిపత్రంలోని మార్కులను ఎక్కువ మార్కులుగా జాగ్రత్తగా సరిదిద్దింది. ఇంట్లోచూపించింది. సంతృప్తిగా సంతకం చేశాడు గోవిందరావు.ప్రగతి పత్రం తెచ్చి తరగతి టీచర్ కిచ్చింది.మార్కులు విద్యార్థుల ప్రగతి పుస్తకంలోనమోదు చేసుకున్నారని సరళకు తెలియదుమార్కులు దిద్దినవిషయం ఉపాధ్యాయురాలు గుర్తించింది.చాలా పెద్దతప్పు చేశావని సరళను దండించింది.సరళ
మార్కులు దిద్దిన విషయం చెప్పాలనితల్లిదండ్రులను పిల్చుకు రమ్మంది.రెండుదినాలైనా తల్లిదండ్రులను పిల్చుకురాలేదు.
మూడవరోజు తల్లిదండ్రులను తీసుకురమ్మని సరళను పాఠశాలనుండి బయటకుపంపింది టీచర్.పాఠశాలబయట నిల్చుండిపోయింది సరళ.ఇంటికెళ్ళి విషయం చెబితే వాతలుతేలేలాతంతారు.ఇంటికెళ్ళటం కుదరదు.పాఠశాలలోకెళ్ళటానికీ వీల్లేదు. ఏంచేయాలో, ఎక్కడికెళ్ళాలో అర్థంకాలేదు.వెక్కివెక్కి ఏడుస్తూ వుండిపోయింది.ఆలోచనలు రకరకాలుగా పరుగెడుతున్నాయి. పెద్దతప్పుచేశాననికుమిలిపోతూవుంది.ఓవ్యక్తి కారు దిగిస్కూలువైపు వస్తూ కనిపించాడు.ఆయనను చూడగానే సరళకు ఓ
ఆలోచన వచ్చింది.ఏపరిచయం లేకున్నాఆయనను "అంకుల్...అంకుల్..."అనిపిలిచింది.ఆయన ఆ పాప వైపు చూసి "ఏమ్మా!ఎవరునువ్వు?ఎందుకేడుస్తున్నావు?"అని అడిగారు.ఏడుస్తూనే జరిగిన విషయం ఆయనతోచెప్పి"మార్కులు దిద్ది తప్పుచేశానంకుల్!
ఎప్పుడూ అలాంటి తప్పుచేయను.మా అమ్మ,నాన్నలకి తెలిస్తే కొడతారు.మీరు నాకు అంకుల్ అవుతారని,నాన్నపంపారని టీచర్ తో చెప్పండి.ఇంకెప్పుడూఅలాంటిపని చేయనని తరగతిలో చేర్చుకోమనిచెప్పండి."అని వెక్కివెక్కి ఏడ్వసాగింది."చూడమ్మా!నువ్వు మార్కులు దిద్దడంతప్పు.అదీగాక ఇప్పుడు నేను మీ అంకుల్నని,మీ నాన్న పంపించాడని అబద్దమాడటం ఇంకా పెద్ద తప్పు.మీ టీచర్
తో నేను చెబుతానురా!"అంటూ ఆయనసరళచేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడు.ఫోన్ చేసి గోవిందరావును పిలిపించారు.
ఉపాధ్యాయులు ఆగది దగ్గరకు చేరుకున్నారు.ఆయన జరిగిన విషయంగోవిందరావుకు వివరించి "పాప తాను చేసి
న తప్పు తెలుసుకుంది.ఎప్పుడూ ఇలాంటిపనులు చేయనని బాధపడుతోంది.ఇలాజరగటానికి కారణం మార్కులు తగ్గితే
మీరు దండిస్తారనే భయం.తన్నటం,తిట్టడం వల్ల బాగా చదివి గుర్తుపెట్టుకుంటారనుకోవటం పొరపాటు.మంచి మాటలద్వా రా,ప్రశంసించటం ద్వారా,బహుమతులద్వారా చదివేలా చేయవచ్చు.ఙ్ఞాపకముండటానికి అవలంభించాల్సిన పద్దతులను అనుసరించాలి.టీచర్లు వ్యక్తిగత బోధనచేయాలి.ఉపాధ్యాయులు తయారుచేసిన,విద్యార్థులు తయారుచేసిన అభ్యసన సామాగ్రి బోధనలో బాగా ఉపయోగించాలి.క్రమంగా వారి అభ్యసనలో మార్పుతేవాలి.కొట్టడం,తిట్టడం వల్ల పిల్లల్లో  మార్పు రాకపోగా ,వాళ్ళ ఆలోచనలు పెడదారి పట్టేఅవకాశముంది.పారిపోవటం లాంటి సంఘటనలు జరుగుతాయి."అంటూ వివరించారుగోవిందరావుకు తన పొరపాటు అర్ధమయింది."క్షమించండి!మీరు చెప్పిందిఅక్షరాలా నిజం.నా కళ్ళు తెరిపించారు.ఇంతకీ మీరేం చేస్తుంటారు"అన్నాడు.
"నేను ఈమండలానికి కొత్తగా వచ్చినవిద్యాధికారిని.పాఠశాల సందర్శనకు వచ్చాను."చెప్పారాయన."క్షమించండి నాన్న!ఇంకెప్పుడూ తప్పులుచేయను"అంది సరళ.విద్యాధికారి నవ్వి"తప్పు చెయ్యడం ఒకతప్పయితే, ఆతప్పును కప్పి పుచ్చుకోవడానికి మరో తప్పు చెయ్యడం పెద్ద తప్పు.తప్పులమీద తప్పులు చేస్తూపోతే జీవితంవ్యర్థమవుతుంది.ఫలితంగా జీవితంలోఎందుకూ పనికిరాకుండా పోతారు.అలాగనితప్పుచెయ్యని వారు ఉండరు.పిల్లలుగానీ,పెద్దలుగానీ తమ తప్పు తెలుసుకుని,ఆతప్పును సరిదిద్దుకొని,మళ్లీ చెయ్యకుండాఉంటే వారి జీవితం బంగారు బాటవుతుంది."అన్నాడు.గోవిందరావు ఆయనకు నమస్కరించివెళ్ళిపోయాడు.