ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తానా ప్రశంసలు పొందిన గంజాం భ్రమరాంబ: -వెదురుకుప్పం ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న తిరుపతి పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి ఉపాధ్యాయిని గంజాం భ్రమరాంబ గారికి అంతర్జాతీయ తానా ప్రపంచ సాహితీ వేదిక ప్రశంసలు లభించాయి. ఫాదర్స్ డే సందర్భంగా జరిగిన కవితా పోటీలలో గంజాం భ్రమరాంబ గారు వ్రాసిన ఉత్తమ కవితగా పలువురి ప్రశంసలు అందుకుంది. "మా కుటుంబం అనే పొదరిల్లుకు మా నాన్న ఒక వసంతం. విలువైన ప్రేమ బంధానికి తానే ఒక సంతకం." అంటూ సాగిన ఆమె కవితకు మంచి గుర్తింపు లభించింది. సినీ ప్రముఖులు సిరివెన్నెల సీతారామశాస్త్రి, తనికెళ్ళ భరణి విశిష్ట అతిధులుగా పాల్గొన్న ఈ కార్యక్రమం తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధి డాక్టర్ ప్రసాద్ తోటకూర గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సమన్వయ కర్త గా శ్రీ చిగురుమళ్ల శ్రీనివాస్ వ్యవహరించారు. త్వరలో అంతర్జాలంలో పెద్ద ఎత్తున జరగబోతున్న తానా కార్యక్రమాలలో పాల్గొనాలంటూ గంజాం భ్రమరాంబ గారికి ఆహ్వానం అందింది. రాయలసీమ ముద్దుబిడ్డగా ఒక కథా రచయిత్రిగా గజల్స్, రుబాయిలు, కవితలు, పద్యాలు, గేయాలు, వ్యాసాలు, సైన్స్ రచనలు వంటి పలు సాహితీ ప్రక్రియలలో ఐదువేలకు పైగా రచనలు చేసి, తనదైన ప్రత్యేక శైలిలో రాణిస్తున్న గంజాం భ్రమరాంబ గారి సాహితీ ప్రస్థానం పలువురికి ఆదర్శంగా నిలిచింది.గతంలో వివిధ సంస్థలనుంచి నవరత్న పురస్కారం, బంగారు నందీ పురస్కారం, గురజాడ జాతీయ పురస్కారం, అంబేద్కర్ రత్న, కళా సరస్వతి,గిడుగు సాహితీ పురస్కారం వంటి అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలు స్వీకరించిన గంజాం భ్రమరాంబ గారు ప్రస్థుతం తానా సంస్థ ద్వారా లభించిన ఈ గుర్తింపు సరికొత్త ప్రోత్సాహాన్ని అందించింది అంటూ వినయంగా తెలియజేసారు. సైన్స్ ఉపాధ్యాయినిగా, తెలుగు భాషాభిమానిగా చేస్తున్న గంజాం భ్రమరాంబ గారి కృషిని పలువురు సాహితీ వేత్తలు, ఉపాధ్యాయులు ప్రశంసించారు. అభినందనలు తెలియజేసారు.
June 22, 2020 • T. VEDANTA SURY • News