ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తానికాయ -ఔషధగుణాలు..పి . కమలాకర్ రావు
November 14, 2020 • T. VEDANTA SURY • health tips

త్రిఫలాలలో తానికాయ ఒకటి.తానికాయ శ్వాస సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.  కంటి సమస్యలు, రక్తదోషాలు రాకుండా కాపాడుతుంది.ఇది పొట్టను కూడా కాపాడడంలో సహాయకారి. తానికాయల పొడి ని నీటిలో కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది.తానికాయల పొడి లో మిశ్రీ కలిపి తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి తానికాయల పొడి లో తిప్పతీగ రసం కలిపి తాగితే జ్వరం త్వరగా తగ్గిపోతుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి తానికాయల పొడి నీటిలో కలిపి తేనె కూడా కలిపి త్రాగించాలి.తానికాయ చెట్టు బెరడును పొడిగాచేసి గోరువెచ్చని నీటిలో కలిపి త్రాగిస్తే గొంతులో  ఇరుక్కున్న నంజు బయటకు వస్తుంది. ఆకలి తగ్గినప్పుడు తానికాయల పొడి నీటిలో కలిపి భోజనం తర్వాత వరుసగా కొద్దిరోజులు త్రాగితే జీర్ణశక్తి పెరిగి మంచి ఆకలి పుడుతుంది.