ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెప్పలు: -- డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి
September 27, 2020 • T. VEDANTA SURY • Story

ఆ సాయంత్రం నేను, బుంగి కలిసి, నిర్మానుష్యంగా ఉన్న కాలిబాట మీద నడుస్తున్నం. బాటకు రెండు పక్కలా గుబురుగా ముళ్ళ పొదలు, బురద గుంటలు ఉన్నవి. బుంగి ఎప్పటిలా ఏదో ఒకటి వాగుతున్నడు. సాయంత్రపు చల్లగాలిని ఆస్వాదిస్తూ వాడి మాటలు వింటున్న. ఇంతలో బెక బెకలు వినిపించాయి. కప్పల జాడ కోసం గాలించిన. ఆగి చిన్న బురదగుంట వైపు చూసిన. అక్కడ పెద్ద కప్ప ఒకటి నీటి కోసం అరుస్తున్నట్లు వినిపించింది. నాలుగడుగులు ముందుకెళ్ళిన.
‘‘కప్పను పట్టుకొని కళ్ళప్పగించి చూస్తున్నవేంది’’ అన్నడు బుంగి
‘‘కప్పల కరువు కనిపిస్తుంది’’
‘‘మా ఇల్లు చెరువు పక్కనే ఉండేది. వానాకాలం వచ్చిందంటే చాలు, ఎక్కడినుండి వచ్చేవో కప్పలు, కుప్పలు, తెప్పలుగా కనపడేవి. పక్కనే ఉన్న ఇండ్లల్లకు కూడా వచ్చేవి. వాటిని మా అమ్మ సంచిలో వేసి, తిరిగి చెరువులో విడిచి వచ్చేది’’
‘‘అవి మీ అతిథులన్నమాట... ఎందుకోచ్చేవి మరి’’
‘‘చెరువులోకి నీరు రావడం వల్ల ఎక్కడి నుండో వచ్చి చేరేవి. నీటి నుండి కాసేపు అలా వాహ్యాళికి, ఇంట్లోకి వచ్చేవి’’ నవ్వుతూ అన్నడు బుంగి.
‘‘ఎంతైనా అది ఉభయచరం కదా!’’ సమర్థింపుగా అన్నాను.
‘‘కప్పల మీద ప్రేమ బాగానే ఒలక పోస్తున్నవు’’
‘‘మా చిన్నపడు వానలు కురువక పోతే. కప్పతల్లి, కప్పతల్లి కడుపునిండే, దొంతాల్ దొంతాల్ దొడ్డినిండే అని పాడుకుంటూ కప్పలకు స్నానం చేయించేవాళ్ళం’’
‘‘ఇపడు మనుషులేక కాదు, కప్పలకు కూడా నీటి కరువొచ్చింది. తాగడానికే నీళ్ళు లేవు. ఇగ కప్పలేకం స్నానం చేయిస్తం’’
‘‘భూమి కొలిమిలా మండుతుంది. వేడికి నీళ్ళలో దూకడానికి చెరువులు లేవు. భూమిపై ఉండటానికి వీలు లేకుండపోయింది. కనుకనే కప్పజాతి కనుమరుగయింది. ఇది ఇలాగే సాగి మరింత వేడెక్కితే మనిషి కూడా కరువయ్యే పరిస్థితి వస్తుంది’’ నిష్ఠూరంగా అన్నాను.
ఎపడు సంపద కలిగిన
నపడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ
సుమతి శతకం
బద్దెన