ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుఁగు బిడ్డ ..: --డా.కె.ఎల్వీ---హనంకొండ
November 15, 2020 • T. VEDANTA SURY • Poem

ఆంగ్లంలో -
చదువుకున్నా ,
ఆంగ్లం ...
మాట్లాడినా ,
ఆంగ్లమే ...
నాఏకైక 
బాషా మాద్యమం 
కాబోదు ....!

తెలుఁగు -ఆంగ్ల,
మాధ్యమాల్లో -
చదివిన 

మాతాత 
మాతృబాష తెలుఁగు !

ఆంగ్ల మాధ్యమంలో 
చదువుకున్న 
మా ..అమ్మమ్మ 
మాతృబాష -తెలుఁగు !

కేజీ  నుండి పీజీ వరకు 
ఆంగ్ల మాధ్యమంలో 
చదువుకున్న మా ..అమ్మ 
మాతృబాష -తెలుఁగు !

తెలుఁగు మాతృబాష 
అయిన మానాన్న ,
చదువుకున్నది 
ఆంగ్లమాధ్యమంలో !

నా ..మూలాలు -
నేపథ్యం -తెలుఁగు ,
నా..సంస్కృతి-
తెలుగు.......!

అందుకే ----
తెలుఁగు నేర్చుకుంటా ,
తెలుఁగు లో  రాస్తా ..
తెలుఁగు మాట్లాడుతా ,
తెలుఁగు చదువుతా ,
తెలుఁగు బిడ్డగా ...
బ్రతుకుతా .....!!
-----------------------
          ఫోటో లో: -బేబీ..ఆన్షి.నల్లి.