ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగుఠీవి పి.వి@ములుగు : డాక్టర్ అమ్మిన శ్రీనివాస రాజు : తెలంగాణబిడ్డగ తొలితెలుగు ప్రధానిగా బహుభాషా కోవిదునిగ బహుముఖ ప్రజ్ఞాశాలిగ విశ్వవ్యాప్తమైన మన పి.వి.నరసింహారావు గారు మొదట తన బంధువు పాములపర్తి సదాశివరావు తో కలిసి 1944సం: కాకతీయవారపత్రిక వరంగల్లు లో స్థాపించి పాత్రికేయునిగా పనిచేసేవాడు,ఆ సమయంలో నే 1957లో రామప్పదేవాలయరాతి శిల్పాలవైభవం స్వయంగా తెలుసుకోవడంకోసం మూడురోజులు పాటు పాలంపేట లోని ఆలయాన్ని దర్శించారు పి.వి, అప్పుడు ములుగు లోగల తనదగ్గరిబంధువు అయిన రావిచెట్టు రాంకిషన్ రావు ఇంట్లోనే వుండి రోజు ఆయనతో కలిసి ఎడ్లబండి మీద పాలంపేట వెళ్లి రామప్ప ఆలయం క్షుణ్ణంగా పరిశీలించి వచ్చేవారు,రాంకిషన్ నైజాంకాలం లో అంకన్నగూడెం నుండి మేడారంవరకు వతన్దారు గా పనిచేసేవాడు, ప్రస్తుతం అతని ఇల్లు ములుగుఅంగడి మైదానం పక్కన శిధిలమైకనిపిస్తుంది,అలా 1957 లో పి.వి రామప్పదేవాలయం పరిశీలించిన స్పూర్తితో ఆయన రాజకీయవేత్త అయి ఢిల్లీలో వున్న సమయంలో అక్కడి నుండి వెలువడే ఆంగ్లపత్రిక "ఇల్యూస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా" లో రామప్పరాతిశిల్పాలవైభవం విశ్లేషిస్తూ " రామప్ప - ఏ సింఫనీ స్టోన్ " అనే వ్యాసం వ్రాశారు, దీనితోనే రామప్ప కీర్తి విశ్వవ్యాప్తమైంది.
August 5, 2020 • T. VEDANTA SURY • Memories